ఒంటికాలిపై కార్మికుల నిరసన | - | Sakshi
Sakshi News home page

ఒంటికాలిపై కార్మికుల నిరసన

Nov 16 2026 12:38 AM | Updated on Nov 16 2026 12:38 AM

ఒంటికాలిపై కార్మికుల నిరసన

బాన్సువాడ రూరల్‌: బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు నెలకు రూ.26వేల వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం కార్మికులు ఒంటి కాలు పై నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఏఐటీయూసి జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్‌ రాములు మాట్లాడుతూ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రతినెల 1వ తేదీన కార్మికుల ఖాతాకు జీతాలు జమ చేయాలని, పండుగ, జాతీయ సెలవులు, మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కార్మికులు జైల్‌ సింగ్‌, సురేఖ, అనసూయ, రజియా బేగం, శ్రావణ్‌, సరోజ, లక్ష్మి, సరిత, మహేందర్‌, గంగారాం, రాజు,యమునా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement