భోజన విరామం తర్వాత..
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో బీఆర్‌ఎస్, బీజేపీ కౌన్సిలర్లు మూకుమ్మడిగా అవినీతి, అక్రమాలపై నిలదీశాయి. టెక్రియాల్ చెరువులో నిమజ్జనమైన విగ్రహాల ఇనుము మాయమవడంపై కమిషనర్ పర్వతాలు, చైర్‌పర్సన్ ఉమారాణిలను నిలదీశారు. కౌన్సిల్ తీర్మా నం లేకుండా ఇంధన ఫిల్లింగ్ స్టేషన్‌ను ఎందుకు మా ర్చారని, పారిశుద్ధ్య సమస్యలపై సమాధానం చెప్పా లని పట్టుబట్టారు. కమిషనర్, చైర్‌పర్సన్‌ల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో విపక్ష కౌన్సిలర్లు పోడియం ముందు బైఠాయించారు. టేక్రియాల్ స్క్రాప్‌తో మున్సిపాలిటీకి సంబంధం లేదని ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు వాదించగా.. గుమ్మడికాయ దొంగ ఎ వరు అంటే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారంటూ బీజేపీ కౌన్సిలర్లు ప్రతివాదనకు దిగారు. బతు కమ్మ, దసరా పండుగ ఏర్పాట్లలో భారీ అక్రమాలు జరిగాయని, కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. భవన నిర్మా ణ అనుమతుల పేరిట సాగుతున్న వసూళ్లపై సమాధానం ఇవ్వాలని, గత సమావేశాల్లో చర్చించిన అభి వృద్ధి పనుల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చే శారు. అధికారులు కేవలం వసూళ్ల కోసమే పనిచేస్తున్నారని, అభివృద్ధిపై దృష్టిపెట్టడం లేదని విపక్షాలు ఆ రోపించాయి. దీంతో అసహనానికి గురైన కమిషనర్ సెలవు చీటీని చైర్‌పర్సన్‌కు అందజేసి సమావేశం నుంచి వెళ్లిపోయారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్‌వై గిరి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
భోజన విరామం తర్వాత కమిషనర్, అదనపు కలెక్టర్ తిరిగి రావడంతో సమావేశం మళ్లీ ప్రారంభమైంది. సాయంత్రం వరకు కూడా సమస్యలు, అవినీతి, అక్రమాలపైనే వాడివేడి చర్చ సాగింది. దీంతో ఎజెండాలోని 40 అంశాల్లో ఒక్కటి కూడా చర్చకు రాలేదు. సానిటేషన్, మోటార్ల మరమ్మతులు, వీధిదీపాలు, నీటి సరఫరా, అభివృద్ధి పనులను ఎమర్జెన్సీ కింద చేపట్టాలని తీర్మానించారు. సమావేశాన్ని ఈనెల 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు చైర్‌పర్సన్ ప్రకటించి సభను ముగించారు. గత మూడు సమావేశాలు కూడా ఇలాగే రసాభాసగా సాగి వాయిదా పడిన విషయం తెలిసిందే. సమావేశంలో వైస్ చైర్‌పర్సన్ కాసర్ల గోదావరి, డీఈ హన్మంత్‌నాయక్, టీపీవోలు వినిత్, ఆర్‌వో రవిగోపాల్‌రెడ్డి, ఆయా విభాగాల అధికారులు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
రసాభాసగా కామారెడ్డి
మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
అవినీతి, అక్రమాలపై విచారణ
చేపట్టాలని విపక్షాల డిమాండ్
సెలవు చీటీ ఇచ్చి సమావేశం నుంచి
వెళ్లిపోయిన కమిషనర్
ఎజెండా అంశాలపై చర్చ లేకుండానే
18కి వాయిదా వేసిన చైర్మన్


