● డీఈవో మల్లికార్జున్
● ముగిసిన జిల్లాస్థాయి సైన్స్ కాంగ్రెస్
కామారెడ్డి టౌన్: విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని డీఈవో మల్లికార్జున్ సూచించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి జాతీయ సైన్స్ కాంగ్రెస్ శుక్రవారం ముగిసింది. కామారెడ్డి ఎస్పీఆర్ హైస్కూల్ విద్యార్థి సాయి కృతి, భిక్కనూరు జెడ్పీహెచ్ఎస్ (బాలుర) విద్యార్థి వెంకట గణేష్, భిక్కనూరు జెడ్పీహెచ్ఎస్ (బాలికలు) విద్యార్థి, తాడ్వాయి టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ విద్యార్థి కె.రూపశ్రీ, పాల్వంచ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి సాత్విక్ గౌడ్, ఎర్రాపహాడ్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి మేఘన, దేవునిపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు సాయి చరణ్, భువన్ ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. రాష్ట్రస్థాయికి ఎంపికై న ఏడు ప్రాజెక్టుల విద్యార్థులు, గైడ్ ఉపాధ్యాయులకు డీఈవో మల్లికార్జున్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి, జిల్లా అకడమిక్ కోఆర్డినేటర్ కృష్ణాకర్రావు, ప్రిన్సిపల్ ప్రణీత, ఫిజికల్ సైన్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, గణిత శాస్త్ర ఫోరం జిల్లా అధ్యక్షుడు రామారావు, ప్రతినిధులు సత్యనారాయణ, వాసు, శ్రీనివాస్, మహిపాల్, తాడ్వాయి శ్రీనివాస్, గౌరి, సుశీల పాల్గొన్నారు.


