రాష్ట్రస్థాయి హాకీ టోర్నీ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి హాకీ టోర్నీ ప్రారంభం

Nov 14 2026 12:53 AM | Updated on Nov 14 2026 12:53 AM

రాష్ట్రస్థాయి హాకీ టోర్నీ ప్రారంభం

బీబీపేట: మండల కేంద్రంలోని టీఎస్‌ఎన్‌ఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం రాష్ట్రస్థాయి అండర్‌ 14 బాలికల హాకీ టోర్నీ ప్రారంభమైంది. ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ క్రీడాకారులతో మాట్లాడారు. సర్పంచ్‌ సాద్విక, పాఠశాల హెచ్‌ఎం రవీంద్రారెడ్డి, హాకీ అసోసియేషన్‌ స్టేట్‌ సెక్రెటరీ నిరంజన్‌గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు నీల లింగం, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీధర్‌, డీఈవో మల్లికార్జున్‌, ఎంపీడీవో గంగాధర్‌, తహసీల్దార్‌ గంగాసాగర్‌, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, సీఐ నరేష్‌, ఎస్సై నవీన్‌చంద్ర, ఉమ్మడి పది జిల్లాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement