● విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలి
● వీసీలో సీఎస్ సంజయ్ జాజు
కామారెడ్డి టౌన్: రబీ సీజన్‌కు సంబంధించి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. నీటి లభ్యతకు అనుగుణంగా పంటల మార్పిడి, కూరగాయల సాగును ప్రోత్సహించాలన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రబీ సాగు, విద్య, భూ అంశాలపై సమీక్షించారు. రాయితీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు మరింత పెరిగేలా చూడాలని, కేజీబీవీలు, గురుకులాల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని ఆదేశించారు. జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణలో అవార్డు జారీ, పరిహారం పంపిణీ, భూముల స్వాధీన ప్రక్రియను వేగవంతం చేసి లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. వీధి కుక్కల నియంత్రణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటిస్తూ ఏబీసీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ తక్కువ నీటితో పండే పంటలు, రాయితీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పిస్తూ, నాణ్యమైన బోధనతో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, డీఆర్డీవో దామోదర్‌రెడ్డి, డీఈవో మల్లికార్జున్, జిల్లా ఉద్యానశాఖ అధికారి జ్యోతి, వ్యవసాయ శాఖ అధికారి మోహన్‌రెడ్డి, డీపీవో మురళి తదితరులు పాల్గొన్నారు.


