నాగిరెడ్డిపేట: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా సహకార శాఖ అధికారి (డీసీవో) రామ్మోహన్ సూచించారు. శుక్రవారం ఆయన మాల్తుమ్మెద, గోలిలింగాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలో ఇప్పటివరకు 16 కేంద్రాల ద్వారా 991.60 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. కార్యక్రమంలో మాల్తుమ్మెద సహకార సంఘం చైర్మన్ సురేందర్‌గౌడ్, సీఈవో సందీప్, డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, భీమయ్య, మహేశ్‌రెడ్డి, సాయికుమార్, గంపల వెంకన్న, అనీఫ్, సాయిరాం, సుజాత, గోలిలింగాల సర్పంచ్ రోజా, ఉపసర్పంచ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట: యాసంగి పంటల సాగు కోసం పోచారం ప్రాజెక్టు నీటిని జనవరి 20న విడుదల చేయాలని తీర్మానించినట్లు ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. నాగిరెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం యాసంగి పంటలసాగు కోసం పోచారం ప్రాజెక్టు నీటివిడుదల విషయమై తైబంది సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రాజెక్టులో 1457.87 అడుగులతో 0.939 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు నుంచి విడుదల చేసే నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఆరుతడి పంటలు కాకుండా వరి వేసి ఎండిపోతే రైతులే బాధ్యత వహించాలన్నారు. నాగిరెడ్డిపేట తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, ఏవో సాయికిరణ్, మాల్తుమ్మెద సొసైటీ చైర్మన్ సురేందర్‌గౌడ్, మత్తమాల సొసైటీ చైర్మన్ జైపాల్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు మురళీమోహన్‌గౌడ్, నాయకులు నర్సింహారెడ్డి, రాంచందర్‌రెడ్డి, సిద్ధయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహించి, 106 కేసులు నమోదు చేసినట్లు సీఐ నరహరి తెలిపారు. నంబర్ ప్లేట్లు లేకపోవడం, చెరిపివేయడం, లైసెన్స్, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, డ్రంకెన్ డైవ్ తదితర కేసులు నమోదు చేసి, 241 చలాన్లు జారీ చేశామన్నారు. ఉల్లంఘనుల నుంచి రూ.1,30,770 జరిమానా వసూలు చేశామని తెలిపారు.


