అటవీ భూములు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

అటవీ భూములు స్వాధీనం

Nov 13 2026 3:53 AM | Updated on Nov 13 2026 3:53 AM

అటవీ భూములు స్వాధీనం

లింగంపేట: బొల్లారం ఫారెస్ట్‌ సెక్షన్‌ పరిధిలోని ఎక్కపల్లి తండా శివారులో 691 కంపార్ట్‌మెంట్‌ నంబర్‌లో ఆక్రమణకు గురైన 50 ఎకరాల అటవీ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బొల్లారం ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి సయ్యద్‌ అశ్వక్‌ ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది పొక్లెయిన్‌ సహాయంతో ఆక్రమిత అటవీ భూముల్లో కందకాలను తవ్వించారు. అడవి ఆక్రమించుకొని పశువులు, అటవీ జంతువులు రాకుండా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ వైర్లను తొలగించామని సెక్షన్‌ అధికారి తెలిపారు. 50 ఎకరాలు అటవీ భూమిలో గుంతలు తవ్వించామని, రాబోయే వాన కాలంలో మొక్కలు నాటుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు శ్రీనివాస్‌, సుజాత, నవ్య, శారద, బేస్‌ క్యాంపు సిబ్బంది జీవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement