తాగునీరు, ఇందిరమ్మ ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

తాగునీరు, ఇందిరమ్మ ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి

Nov 13 2026 3:53 AM | Updated on Nov 13 2026 3:53 AM

తాగునీరు, ఇందిరమ్మ ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి

కామారెడ్డి టౌన్‌: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నిరంతరాయంగా తాగునీటిని అందించడంతోపాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వీబీ జీ రామ్‌జీ పథకం, తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని, నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాలను గుర్తించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను దశల వారీగా పర్యవేక్షిస్తూ, పెండింగ్‌ పనులను త్వరగా పూర్తిచేసి అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. వీబీజీ రామ్‌జీ పథకం పనులను వేగవంతం చేసి కూలీలకు ఉపాధి కల్పించాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌.వై. గిరి, డీఆర్డీవో దామోదర్‌ రెడ్డి, హౌసింగ్‌ పీడీ విజయపాల్‌ రెడ్డి, డీపీవో మురళి, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని మాత్రమే సేకరించాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలను ట్యాబ్‌లలో నమోదు చేయాలని, ప్రక్రియలో జాప్యం లేకుండా చూసి రైతులకు సకాలంలో కనీస మద్దతు ధర చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌లు విక్టర్‌, ఎన్‌.వై. గిరి, సివిల్‌ సప్లయ్‌ డీఎం శ్రీకాంత్‌, డీసీవో రామ్మోహన్‌, డీఆర్డీవో దామోదర్‌ రెడ్డి, డీఎంవో రమ్య, డీఏవో మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement