ఆర్వోబీ కోసం కసరత్తు! | - | Sakshi
Sakshi News home page

ఆర్వోబీ కోసం కసరత్తు!

Nov 13 2026 3:53 AM | Updated on Nov 13 2026 3:53 AM

ఆర్వోబీ కోసం కసరత్తు!

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌ రైల్వే గేటు స్థానంలో పై వంతెన నిర్మించేందుకు భూసేకరణ ప్రక్రియ మొదలయ్యింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లు, ఖాళీ ప్లాట్ల యజమానులకు రెవెన్యూ అధికారులు గురువారం నోటీసులు అందించారు. భూసేకరణ కోసం శుక్రవారం నుంచి రెవెన్యూ, మున్సిపల్‌, విద్యుత్‌ తదితర శాఖల అధికారులు సర్వే నిర్వహించనున్నారు. రోడ్డు మధ్య నుంచి కొలతలు వేసి ఎన్ని అడుగుల మేర ఇళ్లను కూల్చివేయాల్సి ఉంటుందని గుర్తించి, మార్కింగ్‌ ఇస్తారు. అలాగే వంతెన నిర్మించనున్న సమయంలో తొలగించాల్సిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల లెక్క తీయనున్నారు. వంతెన నిర్మాణానికి సంబంధించి ఇదివరకే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ గెజిట్‌ విడుదల చేసింది. కామారెడ్డి ఆర్డీవోకు భూసేకరణ బాధ్యతలు అప్పగించింది. దీంతో రెవెన్యూ అధికారులు భూసేకరణపై దృష్టి సారించారు. వంతెన నిర్మాణంతో ఎన్ని ఇళ్లకు నష్టం జరుగుతుందనేది తేల్చనున్నారు. ఎంత మంది ప్లాట్లు ఏమేరకు నష్టపోతారో తేలనుంది. అయితే వంతెన నిర్మాణ స్థలాన్ని మార్చాలంటూ నష్టపోనున్న ఇళ్లు, ప్లాట్ల యజమానులు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులను కలిసి మొరపెట్టుకున్నారు. ప్రస్తుత స్థలంలో ఆర్వోబీ నిర్మిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అశోక్‌నగర్‌లో ఇళ్లు, ప్లాట్ల

యజమానులకు నోటీసులు

నేటి నుంచి కొలతలు

వేయనున్న అధికారులు

బాధిత కుటుంబాల్లో ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement