ట్రాన్స్‌కోకు రూ.27,912 ఫైన్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌కోకు రూ.27,912 ఫైన్‌

Nov 13 2026 3:53 AM | Updated on Nov 13 2026 3:53 AM

ట్రాన్స్‌కోకు రూ.27,912 ఫైన్‌ మోడల్‌ పాఠశాల తనిఖీ ‘తెల్లముఖం’తో నిరసన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు నేడు జిల్లాస్థాయి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలు

● చెట్లు నరికినందుకు

ఫారెస్ట్‌ అధికారుల నిర్ణయం

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అటవీ ప్రాంతంలో విద్యుత్‌ వైర్ల కింద ఉన్న చెట్లను అ నుమతులు లేకుండా ట్రాన్స్‌కో సిబ్బంది నరికివేసినందుకు ట్రాన్స్‌కో అధికారులకు రూ. 27,912 జరిమానా విధించారు. అక్టోబర్‌ 29 న మండలంలోని బంజార నుంచి తాండూర్‌ గేట్‌ వరకు జాతీయ రహదారి పక్కన ఉన్న అ టవీ ప్రాంతంలో విద్యుత్‌వైర్ల కింద ఉన్న చెట్ల ను నరికేశారు. ఎఫ్‌ఆర్‌వో వాసుదేవ్‌ విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ మేరకు ఫారెస్ట్‌ అధికారులు నాగిరెడ్డిపేట ట్రా న్స్‌కో అధికారులకు జరిమానా విధించారు.

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌ను గురువారం మోడల్‌ స్కూల్స్‌ అదనపు సంచాలకుడు శ్రీనివాసా చారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన లాబొరేటరీలను తనిఖీ చేసిన అనంతరం ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. పది, ఇంటర్‌ విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. వంద శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. డిజిటల్‌ లెర్నింగ్‌ వైపు విద్యార్థులు ఆకర్షితులయ్యేలా చూడాలన్నారు. లైబ్రరీని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రాజిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్లతో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారంతో 31వ రోజుకు చేరుకుంది. నెల రోజులు గడుస్తున్నా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌ సమ్మె శిబిరంలో ‘తెల్లముఖం’తో వినూత్నంగా నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌తో జరగబోయే చర్చల్లోనైనా ప్రభుత్వం సానుకూల నిర్ణయం ప్రకటించి, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు భరోసా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి సుమన్‌, వైద్యులు, నాయకులు బట్టు పద్మజ, మామిండ్ల మారుతి, పల్స హరీశ్‌, వేణుమాధవ్‌, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: వికారాబాద్‌ జిల్లాలో జరగనున్న 36వ రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ బాలుర కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు 14 మంది సభ్యుల జిల్లా జట్టు గురువారం బయలుదేరింది. రైలులో కామారెడ్డి నుంచి వికారాబాద్‌కు బయలుదేరిన క్రీడాకారులకు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌. రాజన్న, ప్రతినిధులు ఘనంగా వీడ్కోలు పలికి, పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ నగేశ్‌, కార్యదర్శి పి. జగదీశ్వర్‌, ఈసీ సభ్యులు ఎం. నర్సింలు, సీహెచ్‌. శ్రీనివాస్‌, సీనియర్‌ క్రీడాకారులు, పీఈటీలు గోపీ, గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: జిల్లాస్థాయి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ (ఎన్‌సీఎస్‌సీ) పోటీలను శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్‌ భవనంలోని మైనారిటీ రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా సైన్స్‌ అధికారి సిద్ధిరాం రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అన్ని యాజమాన్య పాఠశాలల విద్యార్థులు, గైడ్‌ టీచర్లు ఉదయం 10 గంటలకు హాజరై తనకు రిపోర్ట్‌ చేయాలని సూచించారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ప్రజెంటేషన్‌ సమయంలో న్యాయనిర్ణేతలకు నాలుగు చార్టులు లేదా పీపీటీతోపాటు ప్రాజెక్ట్‌ సినాప్సిస్‌, రిపోర్ట్‌, లాగ్‌బుక్‌ను తప్పనిసరిగా సమర్పించాలని పేర్కొన్నారు. పోటీలకు హాజరయ్యే విద్యార్థులు, గైడ్‌ టీచర్లకు భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement