ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడకపోవడంతో పంటకు నీరు అందించేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. బోరుబావులు అడుగంటడంతో పూత దశలో ఉన్న కంది పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన తెప్పవార్ నాందేవ్ నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న కంది పంట ప్రస్తుతం పూత దశలో ఉంది. ఒక తడి నీరు అందిస్తే చేతికొచ్చే అవకాశం ఉండటంతో రోజుకు రూ.3 వేలు ఖర్చుపెట్టి ట్యాంకర్ ద్వారా నీరందిస్తున్నాడు. కనీసం పెట్టిన పెట్టుబడి అయినా దక్కుతుందనే ఆశతో నీరు పెడుతున్నట్లు రైతు నాందేవ్ తెలిపాడు. – మద్నూర్(జుక్కల్)


