మృతిచెందిన అడవి పందులను ఢీకొని ఆటో బోల్తా | - | Sakshi
Sakshi News home page

మృతిచెందిన అడవి పందులను ఢీకొని ఆటో బోల్తా

Nov 13 2026 3:53 AM | Updated on Nov 13 2026 3:53 AM

మృతిచెందిన అడవి పందులను ఢీకొని ఆటో బోల్తా

తాడ్వాయి(ఎల్లారెడ్డి): మృతిచెందిన అడవి పందులను ఆటో ఢీ కొని బోల్తా పడింది. ఈఘటన గురువారం రాత్రి తాడ్వాయి మండలం ఎండ్రియాల్‌ గ్రామ శివారులోని కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారి వద్ద చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. లింగంపేట్‌ మండలం కన్నాపూర్‌ గ్రామ వాసులు పెళ్లి దుస్తుల కొనుగోలుకు కామారెడ్డికి వెళ్లి తిరిగి రాత్రి స్వగ్రామానికి ఆటోలో వస్తున్నారు. అప్పటికి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రెండు అడవిపందులు రోడ్డుపై మృతి చెంది పడి ఉన్నాయి. కామారెడ్డి నుంచి కన్నాపూర్‌కు వస్తున్న ప్యాసింజరు ఆటో డ్రైవర్‌కు మృతిచెందిన అడవి పందులు కనిపించక పోవడంతో ప్రమాదం జరిగింది. ఈఘటనలో ఆటో బోల్తాపడింది. గాయపడ్డవారిని 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ రాజుతో పాటు అందులో ప్రయాణిస్తున్న నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement