● ఇంట్లో చెలరేగిన మంటలు
● రూ.14 లక్షలు ఆస్తి నష్టం
● వృద్ధుడిని కాపాడిన మహిళలు
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మాక్లూర్: మండలంలోని ముత్యంపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా.. ముత్యంపల్లి శివారులో వరి కోతలు కోయడానికి బుధవారం వరి కోత మిషన్‌ను తీసుకొచ్చిన హైచర్ వాహనం రోడ్డు పక్కన నిలిపి ఉంది. గ్రామానికి చెందిన దొడ్డికింది సాయి తేజ (23) బైక్‌పై రాత్రివేళ కాలకృత్యాలకు బయటకు వెళ్లగా, గ్రామ శివారులోని రోడ్డుపక్కన నిలిచిఉన్న ఐచర్ వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి సోదరుడు సాగర్ ఫిర్యాదు మేరకు రోడ్డుపై నిర్లక్ష్యంగా ఉంచిన హైచర్ వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
మాక్లూర్: డిగ్రీ చదువుతున్న కూతురు కళ్ల ఎదుటే అనారోగ్యంతో బాధపడుతుండటాన్ని తట్టుకోలేక ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలూర్ మండలం గుత్ప తండాలో చోటుచేసుకుంది. మాక్లూర్ ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా.. గుత్ప తండాకు చెందిన రాథోడ్ నందు(48) దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న కూతురుకు పక్షవాతం రాగా, నిజామాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించి ఐదు రోజుల క్రితం ఇంటికి తీసుకోచ్చారు. కానీ కూతురు మంచానికే పరిమితం కావడంతో అతడు తీవ్ర మనస్తాపం చెందాడు. ఈక్రమంలో అతడు బుధవారం రాత్రి భోజనం అనంతరం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం తెల్లవారుజామున కుటుంబసభ్యులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
గాంధారి(ఎల్లారెడ్డి): గాంధారి మండలం చద్మల్ తండాలో గురువారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో సుమారు రూ.14 లక్షల ఆస్తి నష్టం వాటిల్లగా, నాలుగు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తండావాసులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన రాయిదాస్ మంగ్లూ, రాయిదాస్ ఇందల్‌సింగ్, రాయిదాస్ రాంసింగ్, రాయిదాస్ గులాబ్ సింగ్ సోదరులు ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో నివాసముంటున్నారు. గురువారం ఉదయం అందరూ వ్యవసాయ పనులకు వెళ్లగా, ఇంట్లో ఒక వృద్ధుడు మాత్రమే ఉన్నాడు. ఆకస్మికంగా ఇంట్లో మంటలు అంటుకొని దర్వాజలు, కిటికీల నుంచి దట్టమైన పొగలు రావడంతో తండావాసుల గమనించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంట్లో ఉన్న వృద్ధుడిని మహిళలు బయటికి తీసుకువచ్చారు. అగ్ని మాపక సిబ్బంది తండాకు చేరేలోపు ఇళ్లలో ఉన్న తిండి గింజలు, దుస్తులు, వంట సామగ్రి, బీరువా లు, ఇతర వస్తువులన్నీ కాలిబూడదయ్యాయి. ఘట నా స్థలాన్ని సర్పంచ్ దేవిసింగ్, జీపీవో గంగారాం, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ పరిశీలించి సుమారు రూ. 14 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. బాధితులకు సర్పంచ్ తక్షణ సహాయంగా బియ్యం, పప్పు దినుసులు అందించారు.
మాచారెడ్డి: మండలంలోని ఘన్‌పూర్ గ్రామ శివారులోగల పేకాట స్థావరంపై గురువారం రాత్రి దాడి చేసినట్లు ఎస్సై విజయ్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం రాగా, పేకాడుతున్న నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. అలాగే వారి వద్ద నుంచి రూ13,270 నగదు, 2 బైక్‌లు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల పోలీసులు డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు ని ర్వహించగా, ఓ వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు అ తడిని గురువారం ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చ గా, జడ్జి విచారించి మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపొద్దని ఎస్సై సూచించారు.


