కామారెడ్డి అర్బన్: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈనెల 14 నుంచి 20 వరకు వివిధ సాంస్కృతిక,సాహిత్య,విజ్ఞాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సంస్థ జిల్లా చైర్మన్ ఎం.చంద్రకాంత్‌రెడ్డి తెలిపారు. గురువారం చైర్మన్ ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యదర్శి వంశీకృష్ణతో కలిసి వారోత్సవాల వివరాలను వెల్లడించారు జిల్లా గ్రంథాలయ సంస్థతో పాటు మండలాల్లోని శాఖా గ్రంథాలయాల్లోనూ వారోత్సవాలు నిర్వహిస్తారన్నారు.
కామారెడ్డి టౌన్ : నియోజకవర్గ పరిధిలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు అంతక్రియల అనంతరం అందించేందుకు రూపొందించిన అన్నపూర్ణ సేవా రథం ప్రచార పోస్టర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, జీసీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ భోజనం ఏర్పాటును ఆయన అభినందించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ, డీసీసీ ఉపాధ్యక్షుడు పంపరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి జూలూరి సుధాకర్, ప్రసాద్, నాయకులు జమీల్, సలీం, రవీందర్ గౌడ్, చాట్ల వంశీ, సాయిబాబా, రంగా రమేష్ గౌడ్, సునీల్ గౌడ్, శ్రీకాంత్, అరవింద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రామారెడ్డి(ఎల్లారెడ్డి): రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ (ఆర్‌జీపీఎస్‌ఆర్) సేవలను గ్రామస్థాయిలో విస్తరించాలని రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో నూతనంగా తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌గా నియమితులైన గీరెడ్డి మహేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ రాష్ట్ర ఇన్‌చార్జి సుభాష్ కూడా ప్రత్యేకంగా పాల్గొని నూతన కన్వీనర్‌కు అభినందనలు తెలిపారు.
భిక్కనూరు: మండలంలోని రెండు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పాలకవర్గాలను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. భిక్కనూరు సింగిల్ విండో చైర్మన్‌గా లింగాల రాజుబాబుగౌడ్, పెద్దమల్లారెడ్డి విండో చైర్మన్‌గా సురేందర్‌రెడ్డిలు నియమితులయ్యారు. అలాగే భిక్కనూరు సింగిల్ విండోకు 12 మంది డైరెక్టర్లు, పెద్ద మల్లారెడ్డికి సింగిల్‌విండోకు 12 మంది డైరెక్టర్లను నియమించారు. నామినేటెడ్ పద్ధతిన నియమించిన ఈ పాలకవర్గాంలో వైస్‌చైర్మన్ పోస్టు లేదు.


