లింగంపేట : జల సంరక్షణకు అందరూ కృషి చేయాలని మండల ప్రత్యేక అధికారి సురేందర్ అన్నారు.గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజుల్లో సాగు, తాగునీరు కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నీటిని పొదుపుగా వాడాలని సూచించారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి పంటను సాగు చేయవద్దని సూచించారు. వరి పంటలు నూర్పిళ్లు చేసిన తర్వాత పంట అవశేషాలను కాల్చవద్దని సూచించారు. పంట అవశేషాలను కాలిస్తే సంబంధిత రైతులకు రూ. 5000 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. ఆరుతడి పంటలు పెసర, మినుము,జొన్న,మొక్కజొన్న,, పొద్దుతిరుగుడు, కుసుమ, కూరగాయల పంటలు సాగు చేసుకుని అధిక లాభాలు పొందవచ్చు అన్నారు. ఈవిషయమై గ్రామాల్లో సర్పంచ్‌లు, అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఇంకుడు గుంతలు, నీటి కుంటల ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చన్నారు.
అధికారుల తీరుపై సర్పంచుల నిరసన
గ్రామాల్లో అధికారులు సమస్యలను పరిష్కరించడం లేదని అధికారుల తీరుపై పలువురు సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సర్పంచులు మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకువచ్చిన గ్రామాలు సందర్శించి పనులు చేపట్టడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీఓ మలహరి, సంగారెడ్డి సొసైటీ చైర్మన్ నాగరాజు, ఆత్మ కమిటీ చైర్మన్ దశరత్ నాయక్, మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్, వైద్యాధికారి హిమబిందు, ఏఈలు, ఫారెస్ట్ సెక్షన్ అధికారి భాస్కర్, ఐకేపీ ఏపీఎం వినోద్ కుమామార్,ఏపీవో నరెందర్, ఆయాశాఖల అధికారులు,సర్పంచ్‌లు పాల్గొన్నారు.
అధికారులు గ్రామాల్లో పర్యటించి పనులు చేపట్టాలి
పంట అవశేషాలు కాలిస్తే
రూ.5 వేలు జరిమానా విధించాలి
మండల ప్రత్యేక అధికారి సురేందర్


