కామారెడ్డి అర్బన్/భిక్కనూరు: దేశాన్ని మత్తు పదార్థాల వినియోగం నుంచి విముక్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం పట్టణానికి చెందిన 62 ఏళ్ల సామాజిక కార్యకర్త ఐ.విజయలక్ష్మి న్యూఢిల్లీ వరకు చేపట్టిన 3వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర గురువారం కామారెడ్డికి చేరుకుంది. రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ సంజీవరెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ జైపాల్‌రెడ్డిలతో పాటు ఆర్‌కే కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఆమెకు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.. అనంతరం ఆర్‌కే కళాశాలలో ‘నషా ముక్త్ భారత్’ అవగాహన సమావేశంలో సామాజిక కార్యకర్త విజయలక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు రంజిత్, బాల్‌రెడ్డి, డీన్ నవీన్, ప్రిన్సిపల్ గోవర్ధన్, గంగాధర్, రెడ్‌క్రాస్ డైరెక్టర్ కిరణ్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే నషా ముక్తు భారత్ సైకిల్ యాత్ర చేస్తున్న ఇందూరి విజయలక్ష్మికి తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌క్యాంపస్‌లో విద్యార్థులు యువకులు, అధ్యాపకులు ఘన స్వాగతం పలికారు. భిక్కనూరు సీఐ నరేశ్ మాట్లాడుతూ యువతను కాపాడుకుందాం దేశ భవష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఇన్‌చార్జి ప్రిన్సిపల్ బందెల అంజయ్య,అధ్యాపకులు ప్రతిజ్ఞ, లలిత, సునీత. సరిత,రమాదేవి,నరసయ్య సునీల్, విజయకుమార్, పోతన్న,శ్రీనివాస్, ఆప్రీస్ బేగం వెంకటరెడ్డిలతో బోధనేతర సిబ్బంది విధ్యార్థులు పాల్గొన్నారు.


