న్యూస్‌రీల్
– 8లో u
ఆదివారం శ్రీ 1 శ్రీ నవంబర్ శ్రీ 2026
ఏ శుభకార్యంలోనైనా జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, తోబుట్టువులు, ఇతర బంధుమిత్రులంతా ఉండాలని
అందరూ కోరుకుంటారు. అయితే అందులో ఎవరైనా భౌతికంగా లేకపోతే ఆ వెలితి పూడ్చలేనిది. వేడుకలో వారు ఉండుంటే బాగుండేదని,
ఎంతో సంతోషించేవారని గుర్తు చేసుకుంటుంటారు. ఆధునిక టెక్నాలజీ ఆ లోటును కొంత తీరుస్తోంది. చనిపోయినవారు దివినుంచి భువికి
దిగివచ్చి వధూవరులను ఆశీర్వదిస్తున్నట్లుగా ఏఐ సాయంతో వీడియోలు రూపొందించి స్క్రీన్లపై ప్రదర్శిస్తున్నారు. మృత్యువు దూరం చేసిన
ఆత్మీయులు తిరిగివచ్చి దీవిస్తున్నట్లుగా ఉంటున్న ఆ చిత్రాలు కుటుంబ సభ్యులనేకాదు ఆహూతులనూ భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.
శుభకార్యాల్లో కొత్త ట్రెండ్‌పై సండే స్పెషల్..
● పెళ్లి మండపంలో మంగళవాయిద్యాలు మో గుతున్నాయి. బంధువులు, స్నేహితుల రాకతో ఆవరణంతా సందడిగా మారింది. కూతురు పెళ్లి అవుతోందన్న సంతోషం ఓవైపు.. చనిపోయిన తన తండ్రి ఉండి ఉంటే ఎంత సంతోషించేదోవాడోనన్న అంశం మరోవైపు.. ఆ తండ్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాళి కట్టడం పూర్తయిన మరుక్షణమే అ క్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్ మీద ఓ వీడియో ప్రదర్శన మొదలైంది. పెళ్లి కూతురు తండ్రి ఆ వీడియో చూస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. దివికేగిన తన తండ్రి నడుచుకుంటూ వచ్చి వధూవరుల ను ఆశీర్వదిస్తున్నట్లున్న ఆ వీడియోతో ఆనందబాష్పాలు ధారగా కారసాగాయి. ఆ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులతోపాటు ఆమెతో అనుబంధం ఉన్నవారు సైతం భావోద్వేగానికి గురయ్యారు.
దివినుంచి భువికి దిగివస్తున్న
పితృదేవతలు
వధూవరులను ఆశీర్వదిస్తున్నట్లుగా వీడియోలు
మ్యాజిక్ చేస్తున్న ఏఐ..
పెళ్లిళ్లలో కొత్త ట్రెండ్
భావోద్వేగానికి గురవుతున్న ఆహూతులు


