జోరందుకున్న పేకాట | - | Sakshi
Sakshi News home page

జోరందుకున్న పేకాట

Nov 1 2026 4:49 AM | Updated on Nov 1 2026 4:49 AM

బాన్సువాడ అటవీ ప్రాంతాల్లో..

తప్పించుకోలేరు

● దాడులు చేస్తున్నా ఆగని జూదం

● జీవితాలు ‘మూడు ముక్కలు’

● అడ్డాలుగా పట్టణ శివారు,

జిల్లా సరిహద్దు ప్రాంతాలు

● మూడు రోజుల క్రితం ఫూలాంగ్‌ సమీపంలో పోలీసులు దాడులు చేసి పేకాడుతున్న ఆరుగురిని అరెస్టు చేశారు.

● నగరంలోని వినాయక్‌నగర్‌ ప్రాంతంలో ఈ నెల 18న పేకాడుతున్న తొమ్మిది మందిని పోలీసులు పట్టుకొని రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు.

నిజామాబాద్‌అర్బన్‌: ఒక్కసారి అదృష్టం కలిసొస్తే డబ్బు రెట్టింపవుతుందన్న ఆశ, ఓటమిని పూడ్చుకునేందుకు మరో పందెం..ఇలా మొదలైన జూదం చివరకు జీవితాన్నే పందెంగా మారుస్తోంది. డబ్బు, కుటుంబం, భవిష్యత్‌ మూడు ముక్కలుగా జీవితాన్ని చీల్చుతున్న పేకాట దీపావళి పండుగ సంద ర్భంగా ఉమ్మడి జిల్లాలో జోరందుకున్నది. ఒకవైపు పోలీసులు దాడులు చేస్తున్నా రహస్య ప్రాంతాల్లో పేకాట కొనసాగుతుండటం గమనార్హం.

నిర్వాహకులుగా మాజీలు..

నిజామాబాద్‌ జిల్లాలో మాజీ ప్రజాప్రతినిధులే పేకాట కేంద్రాల నిర్వాహకులుగా తయారయ్యారు. జిల్లా కేంద్రంలోని హమాల్‌వాడి ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు కొన్నేళ్లుగా పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారు. బైపాస్‌ రోడ్‌లో తాత్కాలికంగా షెడ్డు వేసి రాత్రింబవళ్లు పేకాట కొనసాగిస్తున్నారు. దుబ్బా ప్రాంతంలో ఓ మాజీ ప్రజాప్రతినిధి తన ఇంట్లోనే పేకాట కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. గంగస్థాన్‌ ఫేస్‌–2లోని ఓ అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్తులో ప్రతిరోజు పేకాట కొనసాగుతోంది. ఇక్కడ ఓ కాంట్రాక్టర్‌ , మాజీ ప్రజాప్రతినిధి కలిసి పేకాట నిర్వహిస్తున్నారు. మాక్లూర్‌కు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి పేకాట ఆడేవారిని సరిహద్దు ప్రాంతాలకు తీసుకెళ్లి ఆడిస్తుండటం విశేషం. జిల్లా కేంద్రంతోపాటు మహారాష్ట్రలోని నయాగావ్‌, మాక్లూర్‌ మండలం చిన్నాపూర్‌, అడవి మామిడిపల్లి, హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో పేకాట నిర్వహిస్తున్నారు. నగరంలోని ఐదో స్టేషన్‌ పరిధిలో ఓ ప్రజాప్రతినిధి, మరో రౌడీషీటర్‌ గంజాయి విక్రయాలతోపాటు పేకాట, మట్కా కేంద్రాలను కొనసాగిస్తున్నట్లు తెలిసింది.

మామూళ్లతో అపవాదు

కొన్నేళ్లుగా పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్న నాయ కులు పోలీసులకు చిక్కడం లేదు. అయితే స్థానిక అధికారులు కొందరు నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకూ మామూళ్లు తీసుకుంటారనే అపవాదు ఉంది. ముడుపులు అందజేస్తూ దాడుల సమాచారం ముందే తెలుసుకొని నిర్వాహకులు తప్పించుకుంటున్నారని సమాచారం.

కేసుల నమోదు ఇలా..

బాన్సువాడ: బాన్సువాడ డివిజన్‌లో పేకాడుతు న్న వారు రహస్య ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. బాన్సువాడ, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ అటవీ ప్రాంతాలను ఎంచుకొని గ్రూపులుగా ఏర్పడి జూదం ఆడుతున్నారు. ఇటీవల బాన్సు వాడ మండలం తాడ్కోల్‌ శివారు, మొగులాన్‌పల్లి శివారు, బీర్కూర్‌ మండలం బైరాపూర్‌, చించొల్లి గ్రామాల్లో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేసి పలువురిని అరెస్ట్‌ చేశారు. వాట్సాప్‌లలో లోకేషన్లు షేర్‌ చేస్తూ పేకాట స్థావరాలను కొనసాగిస్తున్నారు. బాన్సువాడ మండలం కొయ్యగుట్ట సమీపంలో పెద్ద ఎత్తున జూదం ఆడుతున్నట్లు తెలిసింది. బాన్సువాడ పట్టణంలో మూడు చోట్ల పేకాట అడ్డాలు వెలిసినట్లు సమాచారం. బీర్కూర్‌ మంజీర ప్రాంతంలో నిత్యం పేకాట స్థావరాల్లో రూ. లక్షల్లో చేతులు మారుతున్నాయి. రోజుకో చోట అడ్డాలను మారుస్తూ పేకాట స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల దాడుల్లో పట్టుబడినా జూదం మానకపోవడం గమన్హారం.

పేకాడుతున్న వారు పోలీసుల నిఘా నుంచి తప్పించుకోలేరు. పక్కా సమాచారంతో దాడులు చేస్తాం. కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరినీ వదిలిపెట్టం. వరుసగా మూడుకు పైగా కేసులైతే.. పీడీ యాక్ట్‌ నమోదు చేస్తాం.

– ప్రకాశ్‌ యాదవ్‌, ఏసీపీ, నిజామాబాద్‌ డివిజన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement