కేజీబీవీల్లో గదుల కొరత | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీల్లో గదుల కొరత

Nov 1 2026 4:49 AM | Updated on Nov 1 2026 4:49 AM

అధికారుల దృష్టికి తీసుకువెళ్లా

● ఒకే గదిలో రెండు తరగతుల నిర్వహణ

● వరండాలలో బంకర్‌ బెడ్లు

● ఇబ్బందిపడుతున్న విద్యార్థులు

నిజాంసాగర్‌ : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో గదుల కొరత తీవ్రంగా ఉంది. అవసరమైన గదుల నిర్మాణం చేపట్టకపోవడంతో విద్యార్థినులు ఇబ్బందిపడుతున్నారు. జిల్లాలోని నిజాంసాగర్‌, పిట్లం, మద్నూర్‌, జుక్కల్‌, బిచ్కుంద, బాన్సువాడ, భిక్కనూరు, బీబీపేట, బీర్కూర్‌, దోమకొండ, గాంధారి, కామారెడ్డి, లింగంపేట, మాచారెడ్డి, నాగిరెడ్డి పేట, రాజంపేట, రామారెడ్డి, తాడ్వాయి, ఎల్లారెడ్డి మండలాల్లో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా లున్నాయి. మొదట్లో ఆరో తరగతి నుంచి పదో తర గతి వరకు విద్యనందించారు. అనంతర కాలంలో వీటిని ఇంటర్‌ వరకు అప్‌గ్రేడ్‌ చేశారు. తరగతులు పెరగడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రస్తు తం ఒక్కో విద్యాలయంలో 360 మంది వరకు బా లికలు చదువుకుంటున్నారు. తరగతులు అప్‌గ్రేడ్‌ చేసిన ప్రభుత్వం అదనపు గదుల నిర్మాణం చేపట్టకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వరండాలో మంచాలు..

నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో తరగతి గదుల కొరత ఉంది. దీంతోపాటు డార్మెట్‌ రూంలు లేకపోవడంతో వరండాలో బంకర్‌బెడ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్కూల్‌లో 348 మంది బాలికలున్నారు. ఆరో తరగతినుంచి ఇంటర్‌ వరకు తొమ్మిది తరగతి గదులు అవసరం ఉండగా.. ఏడు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఒకే గదిలో రెండు తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే 12 డార్మెట్‌ రూంలకుగాను తొమ్మిదే ఉండడంతో కొందరికి వరండాలో బంకర్‌ బెడ్లను ఏర్పాటు చేశారు. పై అంతస్తులో ప్రహరీకి ఆనుకుని బెడ్లను ఏర్పాటు చేయడం గమనార్హం. దీంతో విద్యార్థుల భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారింది. గదుల కొరత ఉన్న అన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గదుల కొరత తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.

కస్తూర్బాలో తరగతి గదులు, డార్మెట్‌ రూంల కొరత ఉంది. ఈ విషయాన్ని జిల్లా అధికారులు దృష్టికి తీసుకువెళ్లా. గతంలో పలుమార్లు వినతి పత్రం ఇచ్చా.

– సరోజన, కేజీబీవీ ప్రిన్సిపల్‌, నిజాంసాగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement