తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు.. | - | Sakshi
Sakshi News home page

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు..

Nov 1 2026 4:49 AM | Updated on Nov 1 2026 4:49 AM

కామారెడ్డి టౌన్‌ : సంప్రదాయ పంటలకంటే ఉద్యాన పంటలు, కూరగాయల సాగుతో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించవచ్చని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ పేర్కొన్నారు. క్యాసంపల్లిలోని రైతు కొమిరెడ్డి అంజయ్య సాగు చేస్తున్న మిర్చి, క్యాప్సికం తోటలను శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటల సాగు విధానం, మార్కెటింగ్‌, దిగుబడి, అందుతున్న ఆదాయ వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు అంజయ్య మాట్లాడుతూ మూడేళ్లుగా క్యాప్సికం సాగు చేస్తున్నానని, ఎకరాకు 30 టన్నుల దిగుబడి వస్తోందని పేర్కొన్నారు. టన్నుకు రూ.40 వేల చొప్పున విక్రయించగా మొత్తం రూ.12 లక్షల ఆదాయం వచ్చిందని, ఖర్చులు పోను రూ.10 లక్షల వరకు మిగిలాయని వివరించారు. రైతులు పంట మార్పిడి విధానంలో కూరగాయల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. రైతులు మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటలు సాగు చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌వై గిరి, జిల్లా ఉద్యాన అధికారి జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి, హెచ్‌వో సుమన్‌, హెచ్‌ఈవో బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement