కొడుక్కు తలకొరివి పెట్టిన తల్లి | - | Sakshi
Sakshi News home page

కొడుక్కు తలకొరివి పెట్టిన తల్లి

Oct 30 2026 1:27 AM | Updated on Oct 30 2026 1:27 AM

కొడుక్కు తలకొరివి పెట్టిన తల్లి

రామారెడ్డి(ఎల్లారెడ్డి): కని పెంచిన చేతులతో కొడుక్కి తలకొరివి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందీ తల్లికి. వరుస విషాదాలతో కుంగిన ఆమెకు ఆసరా గా ఉంటాడనుకున్న కొడుకు మృతి గుండెకోత మి గిల్చింది. హృదయ విదారకర ఘటన రామారెడ్డి మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రాని కి చెందిన లక్కాకుల రాజమణి చిన్న కొడుకు నరేశ్‌(32) గురువారం ఉదయం అనారోగ్యంతో మరణించాడు. నరేశ్‌ అన్న రాజు 10 ఏళ్ల క్రితం, తండ్రి ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న చిన్న కొడుకు నరేశ్‌ మృతి చెందగా అతని దహన సంస్కారాలను తల్లి నిర్వహించడంతో స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement