పెద్దకొడప్‌గల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ జిమ్నాస్టిక్ ప్లేయర్, సెర్జెంట్ రాథోడ్ అర్జున్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులకు భవిష్యత్ మార్గదర్శకత్వం, క్రీడల ప్రాధాన్యతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సునీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


