ఆరుతడి పంటలను సాగుచేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలను సాగుచేయాలి

Oct 30 2026 1:27 AM | Updated on Oct 30 2026 1:27 AM

సోమేశ్వర్‌లో అవగాహన కల్పిస్తున్న ఏఈవో కావ్యశ్రీ, తిర్మన్‌పల్లిలో..

బాన్సువాడ రూరల్‌/ నస్రుల్లాబాద్‌/ సదాశివనగర్‌: ఎల్‌నీనో ప్రభావంతో ఏర్పడిన సాగునీటి కొరత వల్ల రైతులు యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని బాన్సువాడ ఏఈవో కావ్యశ్రీ అన్నారు. బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్‌ గ్రామంలో సర్పంచ్‌ చింతల్‌వార్‌ వీరేశం అధ్యక్షతన జీపీలో రైతులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం రాయితీపై శనగ, పొద్దుతిరుగుడు విత్తనాలు అందిస్తోందన్నారు. నస్రుల్లాబాద్‌ మండలంలోని కామిశెట్టిపల్లి, నస్రుల్లాబాద్‌, హాజీపూర్‌లో మండల వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రైతులు యాసంగి పంటకు తక్కువ నీరు అవసరం ఉన్న పంటలనే వేయాలని సూచించారు. అనంతరం కామిశెట్టిపల్లి గ్రామంలో ఫాంపాండ్‌ నిర్మాణానికి ఏఈవో గ్రీష్మ పంట పొలంలో స్థలం పరిశీలించారు. సదాశివనగర్‌ మండలంలోని తిర్మన్‌పల్లిలో ఖేత్‌ బచావో అభియాన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏడీఏ సుధామాధురి భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వాడకం, పంట మార్పిడి, ప్రకృతి వ్యవసాయం, నీటి సంరక్షణ నిర్వహణ, పంట అవశేషాల నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లాల్‌సింగ్‌, ఉప సర్పంచ్‌ మార రమేశ్‌రెడ్డి, వీడీసీ చైర్మన్‌ మార భైరవరెడ్డి, మాజీ సర్పంచ్‌ మధుసూదన్‌ రావు, ఏఈవో కవిత, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement