మహిళలు శాసించే స్థాయికి ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు శాసించే స్థాయికి ఎదగాలి

Oct 28 2026 1:06 AM | Updated on Oct 28 2026 1:06 AM

మహిళలు శాసించే స్థాయికి ఎదగాలి

● గ్రామాల్లో వచ్చేనెల నుంచి

50 రకాల పనులు

● జిల్లాలో పలు అభివృద్ధి పనుల

ప్రారంభోత్సవంలో మంత్రి సీతక్క

బాన్సువాడ/బాన్సువాడ రూరల్‌: ప్రతి మహిళ ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని పంచాయతీరాజ్‌, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఆకాంక్షించారు. మంగళవారం ఆమె జిల్లాలో పర్యటించారు. కొయ్యగుట్ట తండా వద్ద గ్రామ పంచాయతీ భవనాని కి, గ్రామ మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపన చేశారు. బాన్సువాడ మూడో వార్డులో నిర్మించిన మ హిళా సమాఖ్య భవనాన్ని, బోర్లం శివారులో నిర్మించి న 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అనంత రం ఆమె మాట్లాడుతూ మండలానికి రూ.30 లక్షల తో బస్సును కొని ఇస్తున్నామని, దీంతో మండల స మాఖ్యకు బస్సు ద్వారా నెలకు రూ.79 వేల ఆదా యం చేకూరుతోందని పేర్కొన్నారు. వచ్చేనెల 19 నుంచి ఇందిరమ్మ చీరలను అందజేస్తామన్నారు. వీబీ జీ రాంజీలో భాగంగా నవంబర్‌ 1 నుంచి ప్రతి గ్రా మంలో 50 రకాల పనులు చేయించాలని, ఏడాది కా లంలో 375 రకాల పనులు కల్పించాలని ఆదేశించా రు. గ్రామాల్లో తాగునీటి అవసరాల కోసం ప్రతి జిల్లా కలెక్టర్‌కు రూ.కోటి నిధులు ఇచ్చామన్నారు. కొయ్యగుట్ట మహిళా సంఘం భవనం వద్ద రేకుల షెడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు మంజురు చేస్తున్నట్లు ప్రకటించారు.

కరువు లేని ప్రాంతం బాన్సువాడ

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో అన్నిచోట్ల కరువు పరి స్థితులు ఉన్నా.. బాన్సువాడ మాత్రం ఇందుకు మినహాయింపు అని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ మంచి దిగుబడులు వచ్చాయన్నారు. యాసంగిలో ఆరుతడి పంటలే వేయాలని రైతులకు సూచించారు. కార్యక్ర మంలో జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, ఆగ్రో ఇండస్ట్రీస్‌ మాజీ చైర్మన్‌ కాసు ల బాల్‌రాజ్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ కాసుల విజయ, వైస్‌ చైర్మన్‌ రేష్మాబేగం, బోర్లం సర్పంచ్‌ రమేష్‌, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహులు, పర్వంరెడ్డి, రాజేశ్వర్‌గౌడ్‌, సతీష్‌గౌడ్‌, శ్రీనివాస్‌, సాయిలు, భరత్‌, శ్రీశైలం, సంజీవ్‌రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement