డిజైన్‌ మార్పుతోనే అంచనా వ్యయం పెరిగింది | - | Sakshi
Sakshi News home page

డిజైన్‌ మార్పుతోనే అంచనా వ్యయం పెరిగింది

Oct 28 2026 1:06 AM | Updated on Oct 28 2026 1:06 AM

సుభాష్‌నగర్‌(నిజామాబాద్‌ అర్బన్‌): మాధవనగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌వోబీ) డిజైన్‌ మార్పు కారణంగానే అంచనా వ్యయం రూ.9 కోట్లు పెరిగిందని, దానిని ఆర్‌ అండ్‌ బీ శాఖ క్లియరెన్స్‌ కోసం ఆర్థికశాఖకు పంపించి రెండేళ్లు గడిచినా ఇంత వరకు అనుమతి రాలేదని ఎంపీ అర్వింద్‌ ధర్మపురి అన్నా రు. అనుమతులు రాకపోవడంపై అధికార పార్టీ పెద్దలుగా చెప్పుకునే నేతలు సిగ్గుపడాలన్నారు. పనులు పూర్తి చేయాలని, కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం మాధవనగర్‌లోని ఆర్‌వోబీ వద్ద బీజేపీ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, మర్చంట్‌ అసోసియేషన్‌, కుల సంఘాలు, వ్యాపారులు, వర్తకులు, ఆటోయూనియన్‌, సిక్కులు దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అర్వింద్‌ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిపై సుదర్శన్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డిలకు శ్రద్ధ లేదని విమర్శించారు. బోధన్‌ నియోజకవర్గంలో మూడు ఆర్‌వోబీలు, ఆర్‌యూబీలకు నేటికీ డీపీఆర్‌, డిజైన్‌ రూపకల్పన చేయకపోవడం సుదర్శన్‌రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. 1980 నుంచే మాధవనగర్‌లో ఆర్‌వోబీ అవసరం ఉండేదని, 2014లో కవిత ఎంపీగా గెలవగానే మాధవనగర్‌ ఆర్‌వోబీపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారని, కానీ ఆమె కేఎస్‌టీకి భయపడి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని ఆరోపించారు. మాధవనగర్‌ ఆర్‌వోబీ పనుల జాప్యంపై అవసరమైతే అసెంబ్లీలో ఆందోళన చేస్తానని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు. అనంతరం ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి భిక్షాటన చేసి నిరసన తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌పటేల్‌ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, రాష్ట్ర నాయకులు మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి, గద్దె భూమన్న, భరత్‌రెడ్డి, కంచెట్టి గంగాధర్‌, యాదగిరి బాబు, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ ప్రమోద్‌కుమార్‌, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ జ్యోతి పాల్గొన్నారు.

మాధవనగర్‌ ఆర్‌వోబీ పనులపై

అధికార పార్టీ నేతలు సిగ్గుపడాలి

జిల్లా అభివృద్ధిపై వారికి చిత్తశుద్ధి లేదు

ఎంపీ అర్వింద్‌ ధర్మపురి విమర్శలు

భిక్షాటన చేసి నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement