ఫాంపాండ్స్‌తో భూగర్భజలాల పెంపు | - | Sakshi
Sakshi News home page

ఫాంపాండ్స్‌తో భూగర్భజలాల పెంపు

Oct 28 2026 1:06 AM | Updated on Oct 28 2026 1:06 AM

● వాన నీటిని ఒడిసిపట్టేందుకు

నిర్మాణాలు

● ఆదర్శంగా నిలుస్తున్న మండల రైతులు

దోమకొండ: వృథాగా వెళ్లే వాన నీటిని ఒడిసి పట్టి సాగునీటిగా మార్చుకునేందుకు ఫాంపాండ్‌ నిర్మాణానికి మండల రైతులు ఆసక్తి చూపుతున్నారు. పలువురు ఫాంపాండ్‌లు నిర్మించుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు. దీంతో ఫాంపాండ్‌ల నిర్మాణంలో జిల్లాలో దోమకొండ మండలం ముందుంది.

ఒక్కో ఫాంపాండ్‌ నిర్మాణానికి ప్రభుత్వం వీబీజీ రాంజీ పథకంలో రూ. 1.70 లక్షలు కేటాయించింది. ఇరవై మీటర్ల పొడవు, ఇరవై మీటర్ల అడ్డం కొలతలతో నిర్మాణాలు చేపడుతున్నారు. దోమకొండ మండలంలో ఇప్పటివరకు 18 మంది ఫాంపాండ్స్‌ నిర్మాణాలు చేపట్టారు. ఇందులో 12 నిర్మాణాలు పూర్తి కాగా మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. అంచనూరు, అంబారిపేటలలో మూడు చొప్పున, సంఘమేశ్వర్‌, ముత్యంపేట, దోమకొండలలో రెండు చొప్పున నిర్మాణాలు పూర్తయ్యాయి. ఫాంపాండ్స్‌ నిర్మాణాలతో మంచి ఫలితాలు వస్తున్నాయని వారు చెబుతున్నారు. గతంలో వర్షపు నీరు వృథాగా వెళ్లేదని, ప్రస్తుతం వీటిలో నీరు నిలుస్తోందని, తద్వారా భూగర్భ జలాలు పెరిగి బోర్లలో నీటి ఊటలున్నాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితుల్లోనూ బోర్లలో నీరు ఉండడంతో యాసంగిలో కూరగాయలు, ఇతర పంటల సాగు చేయడానికి రైతులు అసక్తి చూపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement