ఆరోగ్యబీమా కార్డులు అందజేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యబీమా కార్డులు అందజేయాలి

Oct 16 2026 7:35 AM | Updated on Oct 16 2026 7:35 AM

ఆరోగ్యబీమా కార్డులు అందజేయాలి ఆర్థికంగా బలోపేతం చేయాలి సిద్దరామేశ్వరాలయం ఈవోగా మైసయ్య

కామారెడ్డి అర్బన్‌: విశ్రాంత ఉద్యోగులకు వెంటనే ఆర్యోగ బీమా కార్డులు అందజేయాలని, బకాయిలను వెంటనే చెల్లించాలని స్టేట్‌ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. గురువారం అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌కు ఈ మేరకు వినతి ప్రతం అందజేశారు. డీఏ బకాయిలను ఏక మొత్తంగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్‌రెడ్డి, విజయరామరాజు, ప్రతినిధులు రవీందర్‌రెడ్డి, రాజలింగం, సుబ్రహ్మణ్యం, మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

దోమకొండ: మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల కుటుంబాలను ఆర్థికంగా బలపేతం చేయాలని డీపీఏం రాజయ్య అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు వ్యక్తిగత రుణాలు అందించేందుకు అవసరమైన దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. దోమకొండ మండల సమాఖ్య కార్యాలయంలో గురువారం వ్యక్తిగత రుణాల దరఖాస్తుల ప్రక్రియపై శిక్షణాలో ఆయన మాట్లాడారు. 29 గ్రామ సంఘాలకు చెందిన వీవోఏ లు, సీసీలు, ఏపీఎం, అకౌంటెంట్‌, కెనరా బ్యాంకు సిబ్బంది, మండల సమాఖ్య పాలకవర్గ సభ్యులు, మహిళ సంఘ సభ్యులకు రుణాల దరఖాస్తులపై అవగాహన కల్పించారు.

భిక్కనూరు: భిక్కనూరు సిద్దరామేశ్వారలయం ఈవోగా మైసయ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఆలయంలో ఈవో మైసయ్యను ఆలయ పునర్‌నిర్మాణ కమిటీ చైర్మన్‌ లింబాద్రి ఆధ్వర్యంలో సన్మానించారు. పునర్‌నిర్మాణకమిటీ వైస్‌ చైర్మన్‌ అందే దయాకర్‌రెడ్డి, సభ్యులు నీల అంజయ్య, చీకోటి ప్రభాకర్‌, అమృత, కార్తిక్‌, రమేష్‌రెడ్డి, అమృత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement