● ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
● ప్రమాణ స్వీకారం చేసిన
సొసైటీల పాలకవర్గాలు
నిజాంసాగర్: రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. గురువారం మండలంలోని అచ్చంపేట, మల్లూర్ సొసైటీ చైర్మన్లుగా పట్లోళ్ల జనార్దన్రెడ్డి, బుజంగారి వినోధ పదవి బాధ్యతలు, ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు ఉత్సాహంగా పని చేయాలని ఏ లే మల్లికార్జున్ పిలుపునిచ్చారు.పిట్లం మార్కెట్ క మిటీ చైర్మన్ చీకోటి మనోజ్కుమార్పటేల్, మండ ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి, రవీంద ర్రెడ్డి, సర్పంచులు లక్ష్మయ్య, బ్రహ్మం, అంజయ్య, మోహన్, పోచయ్య తదితరులున్నారు.
లింగంపేటలో..
లింగంపేట: లింగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా బుర్ర నారాగౌడ్, పాలకవర్గ సభ్యులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నారాగౌడ్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా, సహకార రంగ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. మండల మానిటరింగ్ అధికారి రాధిక, సీఈవో పెంటయ్య, పాలక వర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, సొసైటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


