ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

Oct 16 2026 7:35 AM | Updated on Oct 16 2026 7:35 AM

రామారెడ్డి: మద్దికుంట గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సర్పంచ్‌ మనీష గురువారం భూమి పూజ చేశారు. లబ్ధిదారులకు ఇంటి మంజూరు ధ్రువపత్రాలను అందజేశారు. ఉపసర్పంచ్‌ ముత్యాల రాజు, వార్డు సభ్యులు, కార్యదర్శి నరేష్‌ పాల్గొన్నారు.

లబ్ధిదారులకు మంజురుపత్రాలు అందజేత

బాన్సువాడ : రెండవ విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజురైన లబ్ధిదారులకు గురువారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఆగ్రో చైర్మన్‌ కాసుల బాల్‌రాజ్‌లు మంజురు పత్రాలు అందజేశారు. మున్సిపల్‌ పరిధిలో 31 మంది లబ్ధ్దిదారులకు ఇళ్లు మంజురయ్యాయి. కమిషనర్‌ గంగాధర్‌, నాయకులు ఉన్నారు.

రాజంపేట(భిక్కనూరు): రాజంపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు సాయిబాబా పటేల్‌ ఆధ్వర్యంలో గురువారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. ఉప సర్పంచ్‌ ఇమ్రాన్‌అలీ, నేతలు సుధాకర్‌రెడ్డి, దొబ్బల దుర్గం, కొప్పుల సరేష్‌,జమీల్‌, ప్రవీన్‌, స్వామి, పుట్ట గణేష్‌,బోయిని రమే

ష్‌,రమహత్‌ బీమయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement