నస్రుల్లాబాద్ : మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ ను బాన్సువాడ ఆర్డీవో రవీందర్ ప్రారంభించారు. టోర్నమెంట్ ఏర్పాటు చేసిన యువకులను అభినందించారు. ఆర్డీవో యువకులతో క్రికెట్ ఆడారు.
మాచారెడ్డి: రాష్ట్రస్థాయి ఖో ఖో చాంపియన్ షిప్ పోటీలకు పాల్వంచ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 15 నుంచి 17వరకు నిర్వహించనున్న 45వ తెలంగాణ రాష్ట్ర స్థాయి చాంపియన్ షిప్ పోటీల్లో వారు పాల్గొననున్నారు. బాలికల, బాలుర విభాగంలో ప్రణీత, మహేశ్వరి, ఈశ్వర్, అన్వేష్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపియ్యారు. హెచ్ఎం గోవర్ధన్ రెడ్డి విద్యార్థులు, పీఈటీ అతికుల్లాను అభినందించారు.
దోమకొండ: చేనేత భవన నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేయాలని దోమకొండ చేనేత సహకార సంఘం చైర్మన్ బత్తిని సిద్దరాములు టెస్కో చైర్మన్ దూడెం వెంకటరమణను కోరారు. గురువారం ఆయన హైదరాబాద్లోని చేనేత కార్పొరేషన్ కార్యాలయంలో టెస్కో చైర్మన్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
దూడపై కుక్కల దాడి
పెద్దకొడప్గల్: మండల కేంద్రంలో బుధవారం రాత్రి వీధికుక్కలు ఓ దూడపై దాడికి పాల్పడ్డాయి. కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
కామారెడ్డి అర్బన్: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించి, గోవధపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ గో సమ్మన్ ఆహ్వాన అభియాన్ ప్రతినిధులు గురువారం సంతకాల సేకరణ చేశారు. కల్కినగర్ శ్రీరామ యోగా, అభయ ఆంజనేయ యోగా, మహిళా కేంద్రాల సంయుక్త ఆధ్వర్యంలో కాలనీవాసుల సంతకాలు సేకరించారు.


