బాన్సువాడ రూరల్: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భారతీయ మజ్దూర్సంఘ్ కృషి చేస్తోందని ఆల్ ఇండియా ఆర్టీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కై లాష్ చంద్మాలిక్ అన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా గురువారం ఆయన బాన్సువాడ డిపొను సందర్శించి భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రతినిధులతో మాట్లాడారు. అలాగే ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. తొలిసారి ఆర్టీసీ ఎన్నికల్లో పోటీచేసిన బీఎంఎస్ అత్యుత్తమ ఓట్లు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. బీపీఎంఎం ఉపాధ్యక్షులు వెంకట్రెడ్డి , కార్మిక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి ఎర్ర స్వామి కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవీందర్ గౌడ్, బాన్సువాడ డిపో అధ్యక్షులు ధర్మపాల్, కార్యదర్శి తులసీరామ్, మారుతి మహిళ విభాగం అధ్యక్షురాలు మంజుల, కార్యదర్శి విజయ తదితరులు పాల్గొన్నారు.


