కామారెడ్డి టౌన్: ఆన్‌లైన్ షాపింగ్‌లో డిజిటల్ వాల్ క్లాక్ బుక్ చేస్తే.. తీరా డెలివరీ పార్సిల్‌లో అట్టముక్కలు వచ్చాయి. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీకి చెందిన పొలాస బాబు రూ.999 చెల్లించి ఆన్‌లైన్‌లో డిజిటల్ గోడ గడియారం ఆర్డర్ చేశాడు. మంగళవారం ఆయన చిరునామాకు పార్సిల్ డెలివరీ అయింది. బాక్స్ తెరిచి చూడగా అందులో గడియారానికి బదులు చిత్తు కాగితాలు, అట్టముక్కలు ఉండటంతో కంగుతిన్నాడు. అధికారులు స్పందించి ఇలాంటి ఆన్‌లైన్ మోసాలను అరికట్టాలని ఆయన కోరాడు.


