బాన్సువాడ : బాన్సువాడలోని 108 అంబులెన్సులను మంగళవారం ఉమ్మడి జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ సంపత్ తనిఖీ చేశారు. 108 వాహనాల నిర్వహణ, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 108 ఉద్యోగులకు ఎల్లప్పుడు అండగా ఉంటామని, 108, 102 సేవలపై జాగ్రత్తలు వహించాలని అన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మేనేజర్ తిరుపతి, ఈఎంటీ ప్రసాద్, లక్ష్మణ్, శివ, సంజయ్, బాల్‌రాజ్, పైలెట్లు పుండరీకం, రాజు, రాము, సుభాష్, సతీష్ తదితరులు ఉన్నారు.
బాన్సువాడ రూరల్: రష్యా ఆర్మీలో బలవంతంగా చేర్చబడి, డ్రోన్‌దాడిలో మృతి చెందినట్లు సమాచారం వచ్చిన తాడ్కోల్‌కు చెందిన అఫ్జల్‌ఖాన్ కుటుంబాన్ని ఆగ్రోస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. మంగళవారం బాధితుడి తండ్రి అబ్బాస్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులకు కాసుల బాలరాజ్ ధైర్యం చెప్పి ఓదార్చారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్‌తో ఫోన్లో మాట్లాడి సంఘటన పూర్తి వివరాలు తెలియజేశారు. మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని కాసుల బాలరాజ్ తెలిపారు. ఈకార్యక్రమంలో తాడ్కోల్ సర్పంచ్ అందె రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలీబిన్ అబ్దుల్లా, కౌన్సిలర్ ఖాలెఖ్, మహ్మద్ ఏజాజ్, హఫీజ్ వహాబ్, షేఖ్ అజీమ్, అలీమోద్దీన్‌బాబ, గౌస్, మోయిన్ తదితరులున్నారు.
కామారెడ్డి టౌన్: తమకు ఉద్యోగ భద్రతతోపాటు, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది విధులు బహిష్కరించి, జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు. ఈసందర్భంగా నాయకులు, ఉద్యోగులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 17వేల మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు ఏళ్ల తరబడి వైద్య ఆరోగ్య శాఖలో, ప్రజారోగ్య పరిరక్షణలో కీలక సేవలందిస్తున్నారన్నారు. వెంటనే తమకు పేస్కేల్‌తో కూడిన సమాన పనికి సమాన వేతనం, ఈహెచ్‌ఎస్, ఈఎస్‌ఐ ఆరోగ్య భద్రత, వార్షిక ఇంక్రిమెంట్లు, సెలవుల హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుమన్, నాయకులు సంతోష్, పద్మజ, జిల్లా వ్యాప్త ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు పాల్గొన్నారు.


