● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● ప్రజావాణికి 117 వినతులు
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అ ధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవా రం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 117 ఫిర్యా దులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, రేషన్ కా ర్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, బిల్లుల మంజూరు లాంటి ఫిర్యాదులు, వినతులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించాలన్నారు.ఎప్పటికప్పుడు ఫిర్యా దులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. పెండింగ్ లేకుండా చూసుకోవాలన్నారు. అదనపు క లెక్టర్ విక్టర్, డీఆర్‌వో పాండు, సీఈవో చందర్, వివి ధ శాఖల జిల్లా అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలోని శ్రీ చైతన్య పాఠశాల యజమాన్యం ప్రభుత్వ విద్యా నిబంధనలను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తున్నట్లు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం కామారెడ్డి జిల్లా కమిటీ పేర్కొంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఏఐపీఎస్‌యూ జిల్లా కమిటీ తరఫున వినతిపత్రం అందజేశారు. పాఠశాలలో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆకస్మిక తనిఖీ నిర్వహించాలని ఏఐపీఎస్‌యూ జిల్లా కార్యదర్శి సూర్యపాల్ కోరారు.
భూములకు పట్టాలివ్వాలని
గిరిజనుల ధర్నా..


