సెర్ప్‌ సీఈవోను కలిసిన ఐకేపీ వీవోఏలు | - | Sakshi
Sakshi News home page

సెర్ప్‌ సీఈవోను కలిసిన ఐకేపీ వీవోఏలు

Sep 29 2026 1:27 AM | Updated on Sep 29 2026 1:27 AM

సెర్ప్‌ సీఈవోను కలిసిన ఐకేపీ వీవోఏలు సీనియర్‌ సిటిజన్స్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌గా రాజన్న బెస్ట్‌ ఫిజియోథెరపిస్ట్‌ అవార్డు అందుకున్న సృజన్‌రెడ్డి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ర్యాలీ 30న సిరిసిల్లకు తరలిరావాలి

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రానికి వచ్చిన సెర్ప్‌ సీఈవో దివ్యాదేవరాజన్‌ను సోమవారం ఐకేపీ ఉద్యోగులు కలిసి పుష్పగుచ్ఛం అందించారు. సంఘం ప్రతినిధులు పఠాన్‌ గౌస్‌ఖాన్‌, శివరాంనాయక్‌, గంగా విక్రమ్‌, తేలు బాల్రాజు పుట్ట రాజశేఖర్‌, తదితరులు సీఈవోను కలిసి తాము చేస్తున్న సేవలను వివరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

కామారెడ్డి అర్బన్‌: సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి, రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా మాజీ చైర్మన్‌ ఎం.రాజన్న సోమవారం ఆల్‌ ఇండియా సీనియర్‌ సిటిజన్స్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షుడు రైనాజీ చేతుల మీదుగా రాజన్న నియామక పత్రం అందుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య, ప్రధాన కార్యదర్శి పప్పు విశ్వనాథం, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: సికింద్రాబాద్‌కు చెందిన సాహిత్య, సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ ఆల్‌ ది బెస్ట్‌ ఆర్ట్స్‌ అకాడమీ కామారెడ్డికి చెందిన వైద్యులు సృజన్‌రెడ్డికి బెస్ట్‌ ఫిజియోథెరపిస్ట్‌ పురస్కారం అందజేసింది. సృజన్‌రెడ్డికి బెస్ట్‌ ఫిజియోథెరపిస్ట్‌ అవార్డు అందుకోవడంపై పలువురు అభినందనలు తెలిపారు.

దోమకొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కళాశాల నుంచి స్థానిక గాంధీచౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాంధీచౌక్‌ వద్ద మానవహరంగా ఏర్పడి నినాదాలు చేశారు. కళాశాల ప్రిన్సిపల్‌ శంకర్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

మాచారెడ్డి:రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 30న నిర్వహించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి భారీ బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాల ని మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు ఇలియాస్‌ కోరారు.ఈ మేరకు సోమవారం మాచారెడ్డి షబ్బీర్‌ అలీ ఫంక్షన్‌ హాల్లో నిర్వహించిన సన్నాహక కమిటీ సమావేశంలో వారు మాట్లా డారు. మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నౌసీ లాల్‌ నాయక్‌, నాయకులు మద్ది చంద్రకాంత్‌ రెడ్డి, భూమని బాలరాజ్‌, పండ్ల రాజు, ఐరేని సందీప్‌, గంప ప్రసాద్‌, రామ్మోహన్‌, రాజా గౌడ్‌, గణేష్‌ నాయక్‌, సంతోష్‌ రెడ్డి, గూడెం శ్రీనివాస్‌ రెడ్డి, అస్మత్‌, ఖదీర్‌, అనిల్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement