సంక్షిప్తం.. | - | Sakshi
Sakshi News home page

సంక్షిప్తం..

Sep 29 2026 1:27 AM | Updated on Sep 29 2026 1:27 AM

బోరుమోటర్‌ వద్ద గడ్డిని తొలగించిన అధికారులు

దోమకొండ: మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పిచ్చిమొక్కల మధ్య బోరుమోటర్‌ అనే శీర్షికతో సోమవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కాలనీవాసులు తాగునీటి సౌకర్యం కోసం బోరుమోటర్‌ బిగించిగా, దాని చుట్టూ పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగాయి. దీంతో పంచాయతీ సిబ్బంది వెంటనే బోరుమోటార్‌ చుట్టూ ఉన్న గడ్డిని, పిచ్చిమొక్కలను తొలగించారు. కాలనీవాసులు సాక్షికి కృతజ్ఞతలు తెలియజేశారు.

నేడు లింగంపేట్‌లో విద్యుత్‌

వినియోగ దారుల పరిష్కార వేదిక

గాంధారి: విద్యుత్తు లింగంపేట్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు లింగంపేట్‌ మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌లో మంగళవారం విద్యుత్‌ వినియోగ దారుల పరిష్కార వేదికను ఏర్పాటు చేసినట్లు ట్రాన్స్‌కో ఏఈ లక్ష్మణ్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు పరిష్కార వేదిక ప్రారంభం అవుతుందన్నారు. ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు.

భవన నిర్మాణ కార్మికుల సమావేశానికి

హాజరుకావాలి

ఎల్లారెడ్డిరూరల్‌: జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించే భవన నిర్మాణ కార్మికుల సమావేశానికి కార్మికులందరు హాజరుకావాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు సాయిబాబా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డిలో భవన నిర్మాణ కార్మిక సంఘంలో నిర్వహించే సమావేశానికి కార్మికులందరు హాజరవ్వాలని ఆయన కోరారు.

ఎఫ్‌ఎవో బాండు పంపిణీ

నిజాంసాగర్‌(జుక్కల్‌): మహమ్మద్‌ నగర్‌ మండలం గున్కుల్‌ సోసైటీలో సోమవారం చైర్మన్‌ వాజిద్‌ అలీ చేతుల మీదుగా ఎఫ్‌ఎవో బాండులను పంపిణీ చేశారు. గున్కల్‌ సొసైటీ ఎఫ్‌ఎవోకు ఎంపిక కావడంతో ఒక్కొక్క సభ్యుడికి రూ. 2 వేల చొప్పున డిపాజిట్లు సేకరిస్తున్నామని, డిపాజిట్లు చెల్లించిన సభ్యులకు బాండ్లు అందజేస్తున్నామన్నారు. సీఈవో సాయితేజగౌడ్‌, డైరెక్టర్లు పాల్గొన్నారు.

కార్మికులకు వేతనాలు చెల్లింపు

బిచ్కుంద: బల్దియా పారిశుద్ధ్య కార్మికులకు సోమవారం చైర్‌పర్సన్‌ సీమా షెట్కార్‌ చేతుల మీదుగా ఒక నెల వేతనాలు పంపిణీ చేశారు. గత ఐదు రోజుల క్రితం మూడు నెలల వేతనాలు చెల్లించాలని కార్మికులు కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. దీంతో చైర్‌పర్సన్‌ సీమా షెట్కార్‌ వారం రోజుల్లో వేతనాలు చెల్లిస్తామనే హామీ మేరకు ఒక నెల వేతనాలు పంపిణీ చేశారు. బల్దియా ఆదాయం పెరిగితే వేతనాలు కూడా పెంచుతామని కార్మికులకు హామీ ఇచ్చారు.

ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్‌

తాడ్వాయి: మండలంలోని కాలోజీవాడి గ్రామానికి చెందిన సర్పంచ్‌ ఏలేటి చంద్రారెడ్డి ఎన్నికల సమయంలో నిరుపేదలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు. కాగా గ్రామానికి చెందిన గడ్డం శివలింగం అనే వ్యక్తి ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. నిరుపేద కుటుంబానికి తన వంతు సహాయంగా రూ. 5వేలు అందజేశారు. ఉప సర్పంచ్‌ సాయికుమార్‌, గ్రామపెద్దలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement