బాన్సువాడ రూరల్: బాన్సువాడ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యత సదస్సులు జరగాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆకాంక్షించారు. మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డులో ఆదివారం రాత్రి మదర్సా అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత బహిరంగ సభ నిర్వహించారు. ముఫ్తీ ఉమర్ బిన్ ఈసా అధ్యక్షతన, మౌలాన గులాం యజ్దాని పర్యవేక్షణలో జరిగిన సదస్సులో పోచారం మాట్లాడుతూ అత్యవసర సమయంలో రక్తం అవసరమైనప్పుడు హిందూ, ముస్లిం అని ఎలాగైతే చూడమో.. అన్ని సందర్భాల్లోనూ అలాగే కలిసి మెలిసి ఉండాలన్నారు. తాను బాన్సువాడలో డబుల్ బెడ్ రూం ఇళ్లను కులమతాలకు అతీతంగా అర్హులకే ఇచ్చానని, ఇందులో సగం మంది ముస్లింలేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతం భారత్‌లో విలీనం కావడానికి అష్ఫాకుల్లా ఖాన్, షేక్ బందగీ త్యాగాలు మరువలేనివని మరో వక్త యజ్ఞం పవన్ కుమార్ శర్మ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆగ్రోస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు అమృతం వీరబ్రహ్మం, అమీరే మిల్లత్ మౌలానా జాఫర్ పాషా, జామా మసీదు అధ్యక్షులు రిజ్వాన్, హఫీజ్ మహ్మద్ లాయక్, నాయకులు మక్సూద్, ఖాలెఖ్, ఎజాజ్, రాజేశ్వర్ సోలమన్, ఏసుదాస్, జుబేర్, కృష్ణారెడ్డి, మోహన్‌నాయక్, గణేష్, అలీ బిన్ అబ్దుల్లా, అబ్దుల్ వహాబ్, అఫ్రోజ్, అసద్‌బిన్ మోసీన్, మోచీ గణేష్, రుద్రంగి అశోక్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


