మాక్లూర్: సాగు చేసిన పంటను అడవి పందుల నుంచి కాపాడుకునేందుకు ఓ రైతు పెట్టిన కరెంట్‌షాక్ ఫెన్సింగ్ తన పాలిట మృత్యువైంది. వివరాలు ఇలా.. మండలంలోని అమ్రాద్ తండాకు చెందిన మలోత్ మోహన్ (45) అనే రైతు సోమవారం పొలానికి వెళ్లగా.. పందుల కోసం పెట్టిన కరెంట్ వైర్‌కు ప్రమాదవశాత్తు తగిలాడు. వెంటనే మోహన్ కరెంట్‌షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతుడి భార్య కళాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు.
కామారెడ్డి క్రైం: భిక్కనూరు సమీపంలోని అక్కన్నపేట వద్ద రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. సోమవారం ఉదయం రైల్వే పట్టాలపై మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కామారెడ్డి రైల్వే ఎస్సై లింబాద్రి, సిబ్బంది అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. మృతుడిని మెదక్ పట్టణానికి చెందిన ఎలవర్తి దేవి ప్రసాద్(47)గా గుర్తించారు. అతడి తల్లి రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా, ఏడాది క్రితం తండ్రి మరణించాడు. ప్రసాద్‌కు పెళ్లికాకపోవడంతో ఒంటరిగా జీవిస్తూ మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో అతడు జీవితంపై విరక్తి చెంది, వేకువజామున కృష్ణా ఎక్స్‌ప్రెస్ వెళ్లే సమయంలో రైలు పట్టాలపై పడి మృతి చెందాడని విచారణలో తేలింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.


