కామారెడ్డి క్రైం: సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వసతి గృహల నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, వసతులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, డీఈవో మల్లికార్జున్, సంక్షేమ శాఖల అధికారులు వెంకటేష్, సౌజన్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
మాచారెడ్డి: రాష్ట్ర స్థాయికి ఎంపికై న రగ్బీ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి చేరుకోవాలని మాచారెడ్డి ఎంపీడీవో గోపిబాబు ఆకాంక్షించారు. కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల రాష్ట్రస్థాయి రగ్బీ క్రీడలను సోమవారం మాచారెడ్డి మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ ఆవరణలో నిర్వహించారు. ఆయా మండలాల నుంచి మొత్తం 100 మంది అండర్–14 బాలబాలికలు హాజరుకాగా రాష్ట్రస్థాయికి 16 మంది బాలురు, 16 బాలికలు ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఎంఈవో దేవేందర్ రావు, మాచారెడ్డి హెచ్‌ఎం వెంకటాచారి, ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ శ్రీధర్, పీడీ విజయలక్ష్మి, రసూల్, సర్పంచ్ సంతోష్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
కామారెడ్డి అర్బన్: హన్మకొండ జేఎన్ స్టేడియంలో ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2026లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటి పతకాల పంట పండించారని అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.జైపాల్‌రెడ్డి, కేపీ అనిల్‌కుమార్ తెలిపారు. మహిళల జావెలిన్‌త్రో లో అమృత బంగారు పతకం సాధించారు. పురుషుల 400 మీటర్ల హార్డిల్స్‌లో ఎం.ఈశ్వర్ రజత పతకం సాధించగా, అండర్–20 జావెలిన్‌త్రోలో నవ్యశ్రీ రజత పతకం పొందారు. అండర్–20 విభాగం 400 మీటర్ల పరుగులో పవన్‌కళ్యాణ్ రజత పతకం సాధించారు. రిలే 400 మీటర్ల పరుగులో నవ్యశ్రీ, ప్రహర్ష, రసజ్ఞ, అర్చనలు ఉమ్మడిగా రజత పతకం పొందారు. జిల్లా క్రీడాకారులు 8 పతకాలు సాధించడంపై విజేతలను పలువురు అభినందించారు.
● 29.5 తులాల బంగారం,
ఐదు తులాల వెండి అపహరణ
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలో ఆదివారం సాయంత్రం భారీ చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని శేక్‌చాంద్ హోటల్ సమీపంలో నివాసముంటున్న చింతల భాస్కర్ అనే కిరాణా వ్యాపారి ఇంటికి తాళం వేసి దుకాణానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి తలుపు తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించాడు. ఇంట్లోకి వెళ్లి బీరువా చూసే సరికి తెరిచి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బీరువాలో ఉన్న 29.5 తులాల బంగారు ఆభరణాలు, ఐదు తులాల వెండి, రూ.5 వేల నగదు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదులో చేశారు. సీఐ శ్రీధర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తామని అన్నారు.
బిచ్కుంద : పట్టణంలో నూతన బార్ ఏ ర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎకై ్సజ్ సీఐ వినోద్ రాథోడ్ తెలిపారు. దరఖాస్తుకు అక్టోబర్ 12 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు రూ.లక్ష ఫీజు చెల్లించి టెండర్‌లో పాల్గొనాలని సూచించారు.


