కేజీబీవీలకు బంకర్‌ బెడ్లు | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీలకు బంకర్‌ బెడ్లు

Sep 29 2026 1:21 AM | Updated on Sep 29 2026 1:21 AM

కేజీబీవీలకు బంకర్‌ బెడ్లు

మౌలిక వసతులు కల్పిస్తున్నాం

సద్వినియోగం చేసుకోవాలి

● విద్యార్థినులకు తీరనున్న కష్టాలు

● జిల్లాలో 19 కేజీబీవీలు

నిజాంసాగర్‌(జుక్కల్‌): కస్తూర్బా గాంధీ విద్యాలయాల విద్యార్థినుల కష్టాలు తీరనున్నాయి. ఇన్నాళ్లూ విద్యార్థినులు నిద్రించేందుకు నేలపై చాపలు, దుప్పట్లు పరుచుకొని కాలం వెళ్లదీశారు. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని కేజీబీవీలకు ప్రభుత్వం (బంకర్‌ బెడ్లు) మంచాలను సరఫరా చేస్తోంది. ఇప్పటికే అన్ని కేజీబీవీలకు మంచాలు చేరుకున్నాయి.

5,758 మంది విద్యార్థినులు

జిల్లాలోని బాన్సువాడ, భిక్కనూర్‌, బీబీపేట, బిచ్కుంద, బీర్కూర్‌, దోమకొండ, గాంధారి, జుక్కల్‌, కామారెడ్డి, లింగంపేట, మాచారెడ్డి, మద్నూర్‌, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్‌, పిట్లం, రాజంపేట, రామారెడ్డి, తాడ్వాయి, ఎల్లారెడ్డి మండలాల్లో మొత్తం 19 కేజీబీవీలు ఉన్నాయి. అందులో 5,758 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు, మరికొన్ని కేజీబీవీల్లో ఇంటర్‌ వరకు అందుబాటులో ఉంది.

సౌకర్యాలతో హర్షం..

కేజీబీవీల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యార్థినులకు చదువుతోపాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందజేస్తోంది. ఆరో తరగతి, ఇంటర్‌లో అడ్మిషన్లు పొందిన విద్యార్థినులకు ప్లేట్‌, గ్లాస్‌, స్పూన్‌, ట్రంక్‌ బాక్సులను సైతం అందజేసింది. యూనిఫామ్స్‌, నోట్‌ బుక్స్‌, పాఠ్య పుస్తకాలు, బ్యాంగులు, షూ, టవల్స్‌ను ఇస్తోంది. కేజీబీవీలకు అవసరమయ్యే సామగ్రి సరఫరా చేయడంతో విద్యార్థినులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

కేజీబీవీల్లో వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టిసారించింది. విద్యాబోధనతోపాటు మౌలిక వసతులకు సామగ్రి సరఫరా చేయడం సంతోషకరం. కస్తూర్బాలను బలోపేతం చేయడంతో బాలికల్లో పోటీతత్వం మరింత పెరుగుతుంది.

– సరోజన, ప్రిన్సిపల్‌, కేజీబీవీ, నిజాంసాగర్‌

కేజీబీవీలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలి. ఆరు నుంచి ఇంటర్‌ వరకు వసతితో కూడిన చదువులు అందిస్తున్నాం. విద్యార్థినులకు నాణ్యమైన విద్యా బోధన అందించడంతో తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు.

– సుకన్య, జిల్లా కోఆర్డినేటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement