కామారెడ్డి అర్బన్: స్వచ్ఛతా హీ సేవా–2026, స్వచ్ఛ భారత్–వికసిత్ భారత్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్ , కమిషనర్ దివ్య దేవరాజన్ కోరారు. కలెక్టరేట్‌లోని స్వచ్ఛతా హీ సేవా గాంధీ చిత్రం ఉన్న ఫ్లెక్సీపై వారు సంతకం చేశారు. అనంతరం మొక్కలను నాటారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రతి గ్రామంలో స్వచ్ఛతా ప్రతిజ్ఞ, శ్రమదానం, పారిశుధ్య కార్మికులకు సన్మానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్‌వై గిరి, జెడ్పీ సీఈవో చందర్, డీపీవో మురళి, డీఆర్‌డీవో దామోదర్ తదితరులు పాల్గొన్నారు.


