కామారెడ్డి రూరల్: మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి, జీవనోపాధి మెరుగుదల కోసం ప్రభుత్వం సబ్సిడీపై మంజూరు చేసిన వాహనాలను సోమ వారం లబ్ధిదారులకు అందించారు. రూ.3 లక్షల యూనిట్ విలువ కలిగిన మూడు చక్రాల సామ గ్రి రవాణా వాహనాన్ని 40 శాతం సబ్సిడీతో లబ్ధిదారు ప్రవీణ్‌కు పంపిణీ చేశారు. రూ.10 ల క్షల యూనిట్ విలువ కలిగిన చేపల సంచార వి క్రయ వాహనాన్ని 40 శాతం సబ్సిడీపై పంపరి లక్ష్మికి అందించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి లయక్ మోయినొద్దీన్, ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్ ప్రవీణ పాల్గొన్నారు.


