అ‘పూర్వ’ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

అ‘పూర్వ’ సమ్మేళనం

Sep 28 2026 1:17 AM | Updated on Sep 28 2026 1:17 AM

కామారెడ్డి అర్బన్‌/ ఆర్మూర్‌టౌన్‌/ రామారెడ్డి: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఆదివారం నిర్వహించిన అపూర్వ సమ్మేళనాలు ఆకట్టుకున్నాయి. కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు చెందిన 1982–85 బ్యాచ్‌ డిగ్రీ ఫిషరీస్‌, ఫారెస్ట్రీ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని కళాశాలలో నిర్వహించారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం సమావేశమైన మిత్రులందరూ కళాశాల అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత, బీజేపీ నాయకుడు పైడి ఎల్లారెడ్డి, ప్రభాకర్‌రావు, శ్రీనివాస్‌రావు, బాపురావు, రాజ్‌గంభీర్‌రావు తదితరులు పాల్గొన్నారు. రామారెడ్డి మండలం రెడ్డిపేట ప్రభుత్వ పాఠశాలకు చెందిన 1999–2000 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆ

త్మీయ సమ్మేళనం నిర్వహించారు. 26 ఏళ్ల తర్వాత మిత్రులందరూ ఒకే చోట చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం గురువులను ఘనంగా సన్మానించారు.

ఆర్మూర్‌ జెడ్పీ బాలుర పాఠశాలకు చెందిన 1981– 82 బ్యా చ్‌ పదో తరగతి విద్యార్థులు ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 45 ఏళ్ల తర్వాత మిత్రులందరూ ఒకే చోట చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement