గ్రామపంచాయతీలకు మహర్దశ | - | Sakshi
Sakshi News home page

గ్రామపంచాయతీలకు మహర్దశ

Sep 28 2026 1:17 AM | Updated on Sep 28 2026 1:17 AM

ఎల్లారెడ్డిరూరల్‌: గ్రామ పంచాయతీలకు మహర్దశ రానున్నది. జీపీలకు సంబంధించిన నిధులను గతంలో ట్రెజరీలో జమ చేసిన అనంతరం వాటిని డ్రా చేసుకోవడంలో తీవ్ర జాప్యం జరిగేది. జీపీ అభివృద్ధి నోచుకోవడానికి అడ్డంకులు ఉండేవి. నూతన విధానంతో జీపీలు మరింత అభివృద్ధి చెందనున్నాయి.

బ్యాంకుఖాతా నుంచి..

జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి లో గతంలో గ్రామాల నుంచి వసూలు చేసిన ఇంటి ట్యాక్సులతో పాటు నీటి పన్నులు ఇతర వాటిని అ ధికారులు ట్రెజరీ కార్యాలయంలో జమ చేసే వారు. అనంతరం వాటిని గ్రామ అభివృద్ధికి వినియోగించుకునేందుకు గాను ట్రెజరీ కార్యాలయం నుంచి విత్‌డ్రా చేసుకునేందుకు నెలల తరబడి జాప్యం జరిగేది. దీనికి కారణం తగిన నిధులు లేక పోవడం, నిధులకు సంబంధించి ఫ్రీజింగ్‌ ఉండడంతో నిధులను విడుదల చేసుకోవడంలో తీవ్ర జాప్యం జరగ డంతో జీపీకి సంబంధించిన పనులు చేయడంలో ఎవరు ముందుకు వచ్చేవారు కారు. దీంతో జీపీ అ భివృద్ధి వెనక బడడంతో ప్రభుత్వం నూతన విధా నానికి రూపకల్పన చేసింది. ఇటీవల జీపీ నిధుల ను స్వతహాగా విత్‌డ్రా చేసుకునేందుకు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. దీనికి సంబంధించిన బిల్లు చట్ట రూపం దాల్చగానే జీపీ నిధులను స్వతహాగా విత్‌డ్రా చేసుకుని గ్రామ అభివృద్ధికి సహకరించేలా ఉన్నది. నూతన చట్టం ద్వారా జీపీ నిధులను జీపీ బ్యాంకుఖాతా నుంచి నేరుగా నిధులు విత్‌డ్రా చేసుకుని గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేసుకునేందుకు అవకాశం కలగనుంది.

జీపీ నిధులను నేరుగా విడుదల

చేసుకునేందుకు అవకాశం

గతంలో ట్రెజరీ నుంచి నిధులు డ్రా చేయడంతో బిల్లుల మంజూరులో జాప్యం

జిల్లాలో 526 గ్రామపంచాయతీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement