● మల్లూర్ సొసైటీ మహాజన సభలో
రైతుల ఆగ్రహం
నిజాంసాగర్(జుక్కల్): యూరియా బస్తాకు రూ.19 చొప్పున అదనంగా డబ్బులు వసూల్ చేయడం సరికాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని మల్లూర్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఒంటరి కళ్యాణ అధ్యక్షతన ఆదివారం మహాజన సభ నిర్వహించారు. కార్యదర్శి సాయిలు సంఘం లావాదేవీలు, జమాఖర్చుల నివేదికలను చదివి వినిపించారు. అనంతరం సొసై టీ ఆధ్వర్యంలో యూరియా బస్తాల విక్రయాలకు అదనంగా డబ్బులు వసూల్ చేశారని రైతులు, నాయకులు కార్యదర్శితో వాగ్వాదానికి దిగారు. లారీట్రాన్స్‌పోర్టు కోసం వసూల్ చేశామని కార్యదర్శి సమాధానం చెప్పారు. ట్రాన్స్‌పోర్టు చార్జీలను సొసైటీ భరించాలని రైతులు సభదృష్టికి తీసుకువచ్చారు. ధాన్యం విక్రయాలకు సంబందించి ప్రభుత్వం నుంచి రూ. 33 లక్షల కమిషన్ డబ్బులు రావల్సి ఉందని, ఆ డబ్బులు వస్తే, మార్కెట్ రోడ్డును బాగు చేస్తామన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రజా పండరి, సర్పంచులు పోచయ్య, కెతావత్ నారాయణ, సొసైటీ కార్యదర్శి సాయిలు, నాయకులు విఠల్‌రెడ్డి, బాబుసేట్, బ్రహ్మనంద రెడ్డి, బుడిమె మైశయ్య తదితరులు ఉన్నారు.


