● స్వల్ప తోపులాట
ఆర్మూర్‌టౌన్ : రూ.9కే డ్రెస్ అని ఓ బట్టల షాప్ యాజమాన్యం ప్రకటించిన ఆఫర్‌తో జనం ఎగబడిన ఘటన ఆర్మూర్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. పట్టణంలో నూతనంగా చిన్నారుల బట్టల షాప్‌ను ప్రా రంభించారు. ప్రారంభానికి కొన్ని రోజుల ముందు నుంచి రూ.9, రూ.39, రూ.69, రూ.89కే బట్టలు అని యాజమాన్యం సోష ల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. ఆదివారం వివిధ గ్రామాల నుంచి జనం పెద్ద ఎత్తున షోరూంకు చేరుకున్నారు. దీంతో దుకాణం వద్ద స్వల్ప తోపులాట జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ సిబ్బందితో కలిసి షోరూం వద్దకు చేరుకున్నారు. పరిస్థితి చక్కదిద్ది, భద్రతా కారణాల దృష్ట్యా దుకాణాన్ని మూసివేయించారు.


