కామారెడ్డి పట్టణానికి చెందిన చాట్ల పద్మ, లింగం దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. తండ్రి లింగం రైస్‌మిల్ గుమాస్తా కాగా, తల్లి పద్మ గృహిణి. ముగ్గురు పిల్లల్ని ఉన్నంతలో చదివించి పెళ్లిళ్లు చేశారు. పెద్ద కూతురు లత ఇంటర్ చదివిన తర్వాత పెళ్లయింది. ఆమె హైదరాబాద్‌లో మొబైల్ ఫోన్ షాప్ నడిపిస్తోంది. రెండో కూతురు జ్యోతి ఎంఏ, బీఈడీ చదివి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. మూడో కూతురు స్వాతి ఎంబీఏ చదివి ప్రయివేటు ఉద్యోగం చేస్తోంది. పిల్లల చదువు, పెళ్లిళ్లు పూర్తయి వాళ్లంతా సెటిల్ అయ్యారని లింగం పేర్కొన్నారు.


