టెన్షన్‌ వద్దు ‘సర్‌’! | - | Sakshi
Sakshi News home page

టెన్షన్‌ వద్దు ‘సర్‌’!

Sep 12 2026 1:30 AM | Updated on Sep 12 2026 1:30 AM

టెన్షన్‌ వద్దు ‘సర్‌’!

ఆధారాలు సమర్పించి,

మ్యాపింగ్‌ చేయించుకుంటే సరి

సాక్షి ’ఫోన్‌ ఇన్‌’లో స్థానిక సంస్థల

అదనపు కలెక్టర్‌ ఎన్‌వై గిరి

2002 కంటే ముందు తల్లిదండ్రులు, గు ర్తింపుకార్డులు లేని వారు ఎలా దరఖాస్తు చేసు కోవాలి? – అయ్యల సంతోష్‌, బాన్సువాడ

● అలాంటి వారు ఒక డిక్లరేషన్‌ రాసి ఇవ్వాలి. దాంతోపాటు ఆధార్‌కార్డు కా కుండా మిగిలిన గుర్తింపు కార్డులలో ఏ ఒక్కటై నా స్థానిక బీఎల్‌వోకు అందజేస్తే సరిపోతుంది.

ఇంగ్లిష్‌, తెలుగు పేర్లలో తప్పిదాలు ఉన్నాయని నోటీసులు వచ్చాయి.

– బర్ల చందు, లింగంపేట/రాజు, ముత్యంపేట/శ్రీనివాస్‌ రావు, సర్పంచ్‌, సంగమేశ్వర్‌, దోమకొండ మండలం

● ఏఐ సాంకేతికత కారణంగా పేరు, వయస్సు, జెండర్‌ లాంటి చిన్నచిన్న తప్పిదాలకు నోటీసులు వస్తాయి. ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకుని, బీఎల్‌వో సరైన అధారాలు సమర్పించాలి.

కామారెడ్డి క్రైం: ‘ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియలో భాగంగా చాలామందికి నోటీసులు వస్తున్నాయి. సాంకేతిక కారణాలు, అక్షరాలలో తేడాలు, వయస్సు లేదా పేర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నప్పుడు నోటీసులు జారీ అవుతున్నాయి. దీనికి ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గుర్తింపు కార్డులను సమర్పించి మ్యాపింగ్‌ చేయించుకుంటే సరిపోతుంది’ అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌వై గిరి పేర్కొన్నారు. సర్‌లో భాగంగా నోటీసులు జారీ అవుతుండడంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వారి సందేహాలను నివృత్తి చేసేందుకు శుక్రవారం ‘సాక్షి’ ’ఫోన్‌ ఇన్‌’ కార్యక్రమం నిర్వహించింది. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పాల్గొని ఓటర్ల సందేహాలను నివృత్తి చేశారు. మున్సిపల్‌ కమిషన్‌ పర్వతాలు, ఎన్నికల విభాగం డీటీ రాజేశ్వర్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రశ్న: తండ్రి పేరులో తప్పిదం ఉందని నోటీస్‌ వచ్చినవారు ఏం చేయాలి. ఓటరు స్థానికంగా ఉండకపోతే ఎలా? – చిందం మల్లేష్‌, సర్పంచ్‌ ఇస్రోజీవాడి, కామారెడ్డి మండలం/రమేష్‌, కాటేపల్లి గ్రామం, పెద్దకొడప్‌గల్‌ మండలం/రాజాగౌడ్‌, పర్మళ్ల, లింగంపేట మండలం

అదనపు కలెక్టర్‌ : 1987కు ముందు జన్మించిన వారు ప్రభుత్వం సూచించిన 11 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకదానిని జతచేసి స్థానిక బీఎల్‌వోకు అందజేయాలి. ఓటరు తరఫున ఎవరైనా వివరాలు ఇవ్వవచ్చు. ముందుగా కుటుంబ సభ్యుల వివరాలతో మ్యాపింగ్‌ చేస్తాం. లేదంటే రక్తసంబంధీకుల వివరాలు సరిచూస్తాం. మ్యాపింగ్‌ చేయించుకునే బాధ్యత ఓటరుపైనే ఉంటుంది.

దూరం కారణంగా నోటీసులు వచ్చిన చాలామంది బీఎల్‌వోల వద్దకు వెళ్లలేకపోతున్నారు?

– బొమ్మెర శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌, దోమకొండ

● కుటుంబంలోని ఏ ఒక్క వ్యక్తి అయినా బీఎల్‌వోకు ఆధారాలు సమర్పించవచ్చు.

నోటీసులు ఇవ్వకుండానే నా ఓటును తొలగించారు. – రాకేష్‌, రామారెడ్డి

● వయస్సు, నివాసానికి సంబంధించిన ఆధారాలను ఏఈఆర్‌వోకు అందజేయండి. దాంతోపాటు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోండి.

నా కార్డు, నా తండ్రి కార్డులో ఇంటి పేరు వేరువేరుగా ఉన్నాయని నోటీసు వచ్చింది?

– రామ్‌కోటి చందు

● ఇలాంటి ఫిర్యాదులు చాలా వస్తున్నాయి. ఇద్దరి ఇంటి పేర్లు ఒకేలా ఉన్నటువంటి ఏదైనా ఒక ఆధారం సమర్పించాలి.

మా తోబుట్టువుల వయసులో వ్యత్యాసం ఉందంటూ నోటీసులు వచ్చాయి.

– సందీప్‌, ఇమ్రాన్‌, సలీం, కామారెడ్డి/రాహుల్‌, ఎల్లారెడ్డి

మీ తల్లిదండ్రుల ఆధారాలు సమర్పిస్తూ ఒక డిక్లరేషన్‌ రాసి బీఎల్‌వోకు అందించండి. జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కూడా సమస్యను పరిష్కరించుకోవచ్చు.

నా పుట్టిన ఊరు గజ్వెల్‌. పెళ్లయిన తర్వా త భిక్కనూరులో ఓటు హక్కు పొందాను. సర్‌ ప్రకియలో భాగంగా కుటుంబ సభ్యుల వివరాలు లేవని నోటీసు వచ్చింది. ఏ వివరాలు సమర్పించాలి? – అరుణ, భిక్కనూరు

2002 ఓటరు జాబితాలో ఉన్న కుటుంబ సభ్యులవి గాని, రక్త సంబంధీకుల వివరాలు గాని బీఎల్‌వోకు సమర్పించాలి.

సర్‌ నోటీసులు వచ్చినా.. వృద్ధాప్యం కారణంగా బీఎల్‌వోల వద్దకు వెళ్లలేకపోతున్నాం. ఫోన్‌ చేస్తే అధికారులు స్పందించడం లేదు?

– మురళీమనోహర్‌, సీనియర్‌ సిటిజన్‌, అశోక్‌నగర్‌, కామారెడ్డి

నోటీసు వచ్చాక ఏడు రోజుల సమయం ఉంటుంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ప్రాంతంలోని బీఎల్‌వోకు సమాచారం ఇచ్చి సమస్య పరిష్కరిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement