సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : అమెరి కా పర్యటనకు వెళ్లి న జిల్లా కలెక్టర్ ఆశి ష్ సంగ్వాన్ గురు వారం రాత్రి కామారెడ్డికి చేరుకున్నా రు. ఆయన పక్షం రోజులుగా సెలవులో ఉన్న విషయం తెలిసిందే. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరించారు. శుక్రవారం విధుల్లో చేరిన సంగ్వాన్.. అధికారులతో వరుస సమీక్షలతో బిజీ అయ్యారు.
కామారెడ్డి అర్బన్: వ్యవసాయానికి కోతలు లేకుండా 18 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో శనివారం ఉదయం 11 గంటలకు విద్యుత్ శాఖ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట రైతులతో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. నిరసనలో భారీగా రైతులు పాల్గొనాలని కోరారు.
భిక్కనూరు: మండల కేంద్రంలోని విద్యుత్ స బ్‌స్టేషన్‌ను టీజీఎన్పీడీసీఎల్ ఆపరేషన్ –1 సీ ఈ అశోక్ శుక్రవారం సందర్శించి, లోడ్ వివ రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ విద్యుత్ సరఫరా తీరును, లో డ్ నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నామన్నారు. రా బోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని లోడ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రిడ్ నిబంధనలకు కట్టుబడి ఉంటూ సబ్‌స్టేషన్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట కామారెడ్డి ఎస్‌ఈ సాలియా, డివిజనల్ భిక్కనూరు ఏఈ సంకీర్త్ ఉన్నారు.
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం జూనియర్ బాలురు(అండర్ 20), సబ్–జూనియర్ బాలికల (అండర్–16) కబడ్డీ జిల్లా జట్లను ఎంపిక చేయనున్నారు. ఈ విషయాన్ని జిల్లా కబడ్డీ అడ్‌హాక్ కమిటీ చైర్మన్ గంగాధర్‌రెడ్డి, కన్వీనర్ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి బాలబాలికలు ఆధార్ కార్డు, పదో తరగతి మెమో జిరాక్స్ ప్రతులతో ఉదయం 9 గంటలకు కళాశాల మైదానానికి రావాలని సూచించారు. ఎంపికై న క్రీడాకారులకు వారం పాటు శిక్షణ ఇచ్చి, సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి టోర్నీకి పంపనున్నట్లు తెలిపారు. వివరాలకు 94400 37833 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
మాచారెడ్డి: గజ్యా నాయక్ తండా చౌరస్తాలో మరో ముగ్గురికి డెంగీ సోకింది. ఇటీవల ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు డెంగీ బారిన పడిన విషయం తెలిసిందే. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అద్వైత, సాయిష్ణవి, మనులకు డెంగీ పాజిటివ్ వచ్చిందని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఆదర్శ్ తెలిపారు. దీంతో శుక్రవారం పలువురు అనుమానితుల రక్త నమూనాలను సేకరించామన్నారు. అలాగే దోమల నివారణ మందు పిచికారి చేయించామన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాని సూచించారు.
కామారెడ్డి అర్బన్: వారానికి 5రోజుల పనిదినాలు, పెండింగ్ సమస్యలు, పాత పెన్షన్ విధానం, గ్రాట్యూటీ పెంపు, ఖాళీల భర్తీ, పెన్షనర్లకు ఆరోగ్య బీమా డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం నిర్వహించిన సామూహిక సమ్మె విజయవంతమైంది. జాతీయ బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక(యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని అన్ని బ్యాంకులు మూసి సామూహిక సమ్మె చేశారు. డిమాండ్లతో కూడిన ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె ఉంటుందని జాతీయ బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక నాయకులు ప్రకటించారు. కే.రాజేశ్వరరావు, డి.భాస్కర్, అనుదీప్, రవి తదితరులున్నారు.


