రైల్వే బ్రిడ్జి అలైన్‌మెంట్‌ మార్చాలి | - | Sakshi
Sakshi News home page

రైల్వే బ్రిడ్జి అలైన్‌మెంట్‌ మార్చాలి

Sep 12 2026 1:30 AM | Updated on Sep 12 2026 1:30 AM

రైల్వే బ్రిడ్జి అలైన్‌మెంట్‌ మార్చాలి

కామారెడ్డి క్రైం/కామారెడ్డి టౌన్‌: పట్టణంలోని అశోక్‌నగర్‌లో రైల్వే బ్రిడ్జి అలైన్‌మెంట్‌ మార్చాలని మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ కాసర్ల గోదావరి, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, నాయకులు కోరారు. శుక్రవారం వారు కలెక్టరేట్‌కు తరలివచ్చి అదనపు కలెక్టర్‌ విక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ప్రత్యేక బృందాలు పర్యటించి అశోక్‌నగర్‌ రైల్వే గేటు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన పరిశీలన, పరీక్షలు జరిపినట్లు తెలిపారు. బ్రిడ్జి నుంచి ఒకవైపు మాత్రమే దారిని కేటాయిస్తూ ప్లాన్‌ రూపొందించినట్లు తెలిసిందన్నారు. అలాకాకుండా ప్రజల సౌకర్యార్థం పాతబస్టాండ్‌ వైపు వెళ్లే దారితోపాటు కలెక్టరేట్‌ వైపు కూడా టీ ఆకారంలో దారిని కేటాయిస్తూ ప్లాన్‌ సిద్ధం చేయాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు హఫీజ్‌, రవి యాదవ్‌, ప్రభాకర్‌ యాదవ్‌, పిట్ల వేణు, స్వామి, లోలం శ్రీనివాస్‌, గోపు బాలమణి, నర్సింలు, మన్సూర్‌, మామిండ్ల లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement